పుష్య మాస విశిష్టత



  • చంద్రుడు పుష్యమి నక్షత్రం లో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య”అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. 
  • పుష్యమాసం   తెలుగు మాసాల్లో పదోది. హేమంత రుతువులో రెండవది.
  • పుష్యపౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనది గా చెప్పబడింది.
  • శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్పబడింది.
  • విష్ణువుకు ఇష్టమైన మాసం మార్గశిరం . శివుడికి కార్తీకం. అలాగే పుష్య మాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి.
  • ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమినాడు శనికి తైలాభిషేకం జరిపించి నవ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. 
  • ఈ నెలలో లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధించే సంప్రదాయం ఉంది. అందుకే దీనిని సౌభాగ్య లక్ష్మీ మాసం అని కూడా అంటారు. లక్ష్మీదేవిని ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా పూజిస్తారు. ఈ నెలలోని మంగళవారాలలో లక్ష్మీదేవిని ప్రతిమలోగాని, కలశంలోగాని ఆవాహన చేసి ఆరాధిస్తే అరిష్టాలు తొలగి, కోరిన కోరికలు తీరుతాయని పండితులు చెబుతారు. 
  • మకర సంక్రమణం రోజున ఈ లక్ష్మీపూజ మరింత ఫలప్రదమని దేవీ భాగవత వచనం. 
  • ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. 
  • దేవతారాధనకూ, పితృదేవతల ఆరాధనకూ ఈ మాసం ఉత్కృష్టం.
  • పుష్యమాసంలో వస్తద్రానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి. చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం.
  • ఈ నెలలో నదీస్నానాలు పుణ్యప్రదం. ముఖ్యంగా మకర సంక్రాంతినాడు ప్రయాగ, ఉజ్జయిని, నాసిక్‌, హరిద్వార్‌లలో స్నానాలు విశేష ఫలదాయకమని చెబుతారు. ప్రయాగలోని త్రివేణీ సంగమం సహజంగా పుణ్య ప్రదమైనది. సంక్రాంతి రోజున అక్కడ స్నానం మరింత ఫలితాన్నిస్తుంది.
  • పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి ముందు జురుపుకునే పండుగ భోగి. చీకటితోనే లేచి చలి మంటలతో చీకట్లను పారద్రోలుతారు. దక్షిణాయనానికీ, ధనుర్మాసానికీ ఆఖరు రోజు ఇది. 
  • భోగినాడు వైష్ణవాలయాల్లో గోదారంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండువగా జరుపుతారు. మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే మకర సంక్రాంతి.
  • సంక్రాంతి నాడు శివుడ్ని ఆవునేతితోనూ, నువ్వులతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోతుందని, సకల భోగభాగ్యాలూ కలుగుతాయని ప్రతీతి.
  • సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ చేస్తారు. ఈ రోజు ధనరాశులనూ వ్యవసాయంలో సహకరించే పశువులనూ లక్ష్మీ స్వరూపంగా భావించి, పూజిస్తారు. 
  • ఈ మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. గోదావరి ఏడు పాయలలో ఒకటైన ‘తుల్యభాగ’ తూర్పుగోదావరిలోని చొల్లంగిలో సముద్రంలో కలుస్తుంది. ఆ రోజున అక్కడ స్నానం చేయడంవల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
  • ఈ విధంగా ఈ నెల కూడా పుణ్య ప్రాప్తికి, పాప పరిహారానికి ఎంతో ఉపయుక్తమైనది.

2022 తేదీలు : డిసెంబర్ 24 నుండి జనవరి 21 వరకు .

Comments

Popular posts from this blog

Sri Venkateswara Swamy Temple - Vyalikaval, Bangalore

Sabarimala Temple Calendar 2025 : Opening and Closing Dates in 2025

Sri Prasanna Venkateswara Swamy Brahmotsavam 2024-25 Dates – Balabhadrapuram

Sri Raghavendra Swami Aradhana 2024 Dates

Tirumala Tirupati Brahmotsavam Dates 2025

Sri Lakshmi Narasimha Swamy Divya Tiru Kalyana Mahotsavams 2025 Dates – Antarvedi

Sri Kabbalamma Temple Timings - Kabbalu

Sri Penusila Lakshmi Narasimha Swamy Temple - Penchalakona

Sri Lakshmi Narasimha Swamy Brahmotsavams 2024 - Kadiri