Tirumala: Koilalwar Tirumanjanam on April 02
Ahead of Ugadi
festivities, the temple cleaning fete of Koil Alwar Thirumanjanam will be
conducted at the Srivari temple on April 2.
As
per tradition, the temple cleaning program is performed at the Srivari temple
on any Tuesday ahead of annual festivals like Anivara Asthana, Brahmotsavam,,
Vaikunta Ekadasi, and Ugadi.
This
year the Koil Alwar Thirumanjanam will be conducted on a grand scale between
6.00-11.00 am from April 2. From the Ananda Nilaya Vimana to Bangaru Vakili,
all sub-temples inside the temple, corridors, walls, and roof slabs, all puja
utensils will be cleaned with desi detergents, perfume water is sprayed all
around During the cleaning program the f Srivari Mula Virat will be
covered with a white cloth.
Thereafter
the archakas will allow Srivari Darshan to perform special pujas etc
after the decoration of idols with silks, flowers, and ornaments.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 9న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 2వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.
ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఏప్రిల్ 2న ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
Comments
Post a Comment