శివరాత్రి రోజు శివపూజ

నాలుగు జాములలో శివపూజ నాలుగు రకాలుగా జరుపుతారు.

మొదటిజామునందు శివలింగాన్ని పాలతో అభిషేకించి, పద్మాలతో పూజ చేస్తారు. పెసరపప్పు, బియ్యం కలిపి పులగం వండి నైవేద్యం పెడుతారు. ఋగ్వేదమంత్రాలు పఠిస్తారు.

రెండవజామునందు  శివలింగాన్ని పెరుగుతో  అభిషేకించి,తులసితో అర్చిస్తారు. పాయసం నైవేద్యం పెడుతారు. యజుర్వేదమంత్రాలు పఠిస్తారు.

మూడవజామునందు శివలింగాన్ని నేతితో అభిషేకించి, మారేడు దళాలతో పూజిస్తారు. నువ్వుల పొడి కలిపిన తినుబండారం నైవేద్యం పెడుతారు. సామవేదమంత్రాలు పఠిస్తారు.

నాలుగవ జామునందు  శివలింగాన్ని తేనెతో అభిషేకించి, నీలోత్పలాలతో పూజిస్తారు. కేవలం అన్నం నైవేద్యం పెడుతారు. అధర్వణవేదమంత్రాలు పఠిస్తారు.

ఈ విధంగా అభిషేకం జరపబడుతుండగా శివదర్శనం చేసుకోవడం మహాపుణ్యప్రదం.

Post a Comment

Previous Post Next Post