పరివర్తన ఏకాదశి , పార్శ్వ ఏకాదశి
- భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి లేదా పార్శ్వ ఏకాదశి అని పిలుస్తారు.
- శయనించి ఉన్న విష్ణు భగవానుడు ఈ ఏకాదశి రోజునే ఎడమవైపు నుండి కుడివైపుకు తిరుగుతాడు. అందుకే దీనికి పరివర్తన ఏకాదశి అని పేరు.
- ఈ రోజునే శ్రీ మహా విష్ణువు వామన అవతారాన్ని ఎత్తి మహాబలిని పాతాల లోకానికి పంపిస్తాడు.అందుకే వామన జయంతిని కూడా జరుపుకుంటారు.
- ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన తెలియక చేసిన పాపాలు అన్ని నశిస్తాయని, కోరిన కోరికలు ఫలిస్తాయని అని నమ్మకం.
- ఈ ఏకాదశి మహిమను విన్నంత మాత్రం చేతనే మనిషియొక్క అన్ని పాపాలు నశిస్తాయి.
- ఈ రోజు విష్ణువును ఆరాధించు వాడు నిస్సందేహంగా వైకుంఠానికి వెళ్తాడు
- ఈ రోజు విష్ణు ఆలయం దర్శించడం మంచిది.
- ఈ ఏకాదశి పాలన ద్వారా మనిషి శతాశ్వమేధ యజ్ఞఫలాన్నిపొందగలుగుతాడు .
ఏకాదశి మహిమ, ఏకాదశి రోజు ఏమి చేయాలి ?
2022 తేదీ: సెప్టెంబర్ 06.
Post a Comment