సూర్యగ్రహణం నియమాలు
గ్రహణాలు ప్రధానంగా నాలుగు రకాలుగా ఉంటాయి. అవి సంపూర్ణ, అంగుళీయక, సంకర , పాక్షికం అని వాటి పేర్లు.
చేయాల్సినవి :
- గ్రహణం పట్టడానికి ముందు, వెనుక కూడా స్నానం చేయడం మంచిది
- గ్రహణం విడిచిపెట్టిన తరువాత స్నానం చేయాలి.
- గ్రహణ సమయంలో ఆహారం వండడం, తినడం నిషిద్ధము.
- ఈ సమయంలో రాజస, తామసిక శక్తిని కలిగి ఉండే కాంతి కిరణాలు నెలకు సోకుతాయి,కావున ఈ సమయంలో వండే ఆహారాన్ని భుజించడం వల్ల అనారోగ్యం కలుగుతుంది.
- ఈ సమయంలో జీర్ణశక్తి కూడా లోపిస్తుంది.
- ఈ సమయంలో దాహం కూడా సహజంగా పుట్టదు.
- గర్భిణీలు, పసిపిల్లలు భోజన విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
- నిల్వ ఉండే ఆహారం మీద దర్భపుల్లలు వేసి ఉంచడం మంచిది
- గ్రహణ సమయంలో దానం చేయడం మంచిది
- గ్రహణం తరువాత శివాలయం దర్శించవచ్చు.
- గ్రహణ సమయంలో ధ్యానం,జపం యోగ వంటివి చేసుకోవచ్చు , స్తోత్ర పారాయణాలు చేయవచ్చు.
చేయకూడనివి :
- సూర్య గ్రహణాన్ని నేరుగా చూడకూడదు.
- దేవత విగ్రహాలకు పూజలు, వ్రతాలు నిషిద్ధము
- మాములుగా గ్రహణంతో కలిపి మూడురోజుల పాటు శుభకార్యాలు చేయరు.
ఈ నెల(అక్టోబర్ ) 25 న సూర్యగ్రహణం వస్తుంది.
ప్రారంభ సమయం : మధ్యాహ్నం 2.28 గంటలకు
ముగింపు సమయం : సాయంత్రం 6.32 వరకు
గ్రహణ దోషం వున్నా రాశులు : తుల, మీనం, వృశ్చికం, కర్కాటకం
Post a Comment