2022 : ఖైరతాబాద్ గణేషుడు ప్రత్యేకతలు
ఖైరతాబాద్ మహా గణపతి ఈసారి శ్రీపంచముఖ లక్ష్మీ మహాగణపతి పేరుతో కొలువుదీరనున్నాడు.
ఈ ఏడాది మట్టితోనే ఖైరతాబాద్ గణేషుడు రూపు దిద్దుకుంటున్నాడు.
మట్టి విగ్రహం కాబట్టి గణేషుడిని ముట్టుకోకుండానే దూరం నుంచి దణ్ణం పెట్టుకోవాలని కనీసం రెండు అడుగుల దూరం నుంచి దర్శించుకోవాలి.
రికార్డు స్థాయిలో ఏకంగా 1100ల కేజీల లడ్డూని గణపయ్యకు సమర్పించనున్నారు.
శ్రీపంచముఖ లక్ష్మీ మహాగణపతి విగ్రహం ఎత్తు 50 అడుగులు
ఐదు తలలు, 6 చేతులతో గణేశుడి విగ్రహాన్ని రూపుదిద్దనున్నారు.
అలంకరణ కోసం తలపై ఏడు సర్పాలను ఉంచనున్నారు.
కుడివైపు శ్రీ త్రిశక్తి మహాగాయత్రి , ఎడమ వైపున శ్రీషణ్ముఖ సుబ్రహమణ్యా స్వామి విగ్రహాలు ఏర్పాటుకానున్నాయి.
Post a Comment