ప్రబోధిని ఏకాదశి, ఉత్తాన్న ఏకాదశి





  • శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగనిద్రలో ఉంటాడు.
  • ఆషాడ శుక్ల ఏకాదశి నాడు నిద్రకు ఉపక్రమిస్తాడు, కనుక ఆ రోజు తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని అంటారు.
  • తిరిగి ఉత్థాన ఏకాదశి అని పిలిచే కార్తీక మాస శుక్ల ఏకాదశి నాడు నాలుగునెలల యోగనిద్ర చాలించుకుంటాడు.
  • ఏకాదశి ప్రాముఖ్యాన్ని గురించి స్కాంద పురాణంలో నారదుడికి బ్రహ్మ వివరించాడు. 
  • ఈ ఏకాదశికి విశేష మహిమ ఉంది. దీనిని ఆచరించిన వారికీ పవిత్ర నదులు, సముద్ర స్నానం ద్వారా లభించే పవిత్రత కన్నా అధికంగా లభిస్తుంది. 
  • ఈ రోజు ఏకభుక్తం చేసిన వారికీ గతజన్మ పాపాలు నశిస్తాయి. కేవలం రాత్రి వేళా తింటే గత రెండు జన్మల పాపాలు నశిస్తాయి.
  • కటిక ఉపవాసంతో పాటు, పూర్తీ రాత్రి జాగరణ ఉంటే గత వెయ్య జన్మల పాపాలు నశిస్తాయి.
  • రాత్రి విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు పురాణ కథలు చదువుతూ జాగరణ చేయాలి. 
  • రోజు అంత ఉపవాస దీక్షలో వున్నా వారు మరునాడు, అంటే క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణుపూజ చేసి దీక్ష విరమిస్తారు.
  • ఈ వ్రతం చేసిన వారి ఇంటిలో సర్వ పుణ్యక్షేత్రాల దివ్యత్వం ఉంటుంది.


ఈ రోజుతో చాతుర్మాస దీక్ష ముగుస్తుంది.
ఈ రోజు పండరి యాత్ర ముగుస్తుంది.
ఈ రోజు భీష్మ పంచక వ్రతం కూడా ఆచరిస్తారు.

2022 :  నవంబర్ 04.

No comments