మాఘ పౌర్ణమి , మహా మాఘి
- శిశిర ఋతువులో వచ్చే తొలి మాసం మాఘ మాసం. మాఘమాసం అంటే పాపాలను నశింపచేసేది అని అర్ధం.
- మన ధర్మంలో పవిత్ర తిధుల్లో ఆచరించవలసిన వాటిలో స్నానం తోలినియమంగా చెబుతారు. స్నానాలకు సంబంధించి మాఘమాసానికి ప్రత్యేకత వుంది.
- కోటిజన్మల పాపం సైతం మాఘస్నానం ప్రక్షాళన చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది.
- మాఘమాసంలో సూర్యుని లేలేత కిరణాలు నుంచి వచ్చేశక్తి జాలంలో సంపూర్ణంగా ఉన్నపుడే స్నానం చేయాలి అని పెద్ద సూచన.
- మాఘమాసం అంత స్నానవ్రతాని పాటించాలి. కృష్ణ ద్వాదశినాడు కానీ, మాఘపౌర్ణమి నాడు కానీ వ్రతం సమాప్తి చేయాలి.
- ఈ మాసమంతా స్నానం వ్రతం చేయలేకపోయినా మాఘపౌర్ణమి నాడు సంకల్పం చెప్పుకొంటూ స్నానం చేస్తే ప్రయాగ స్నానఫలం లభిస్తుంది.
- సముద్ర స్నానానికి ఆషాడ, కార్తీక, మాఘ,వైశాఖ పౌర్ణమి తీర్థులు శ్రేష్టం అని అంటారు.
- మహామాఘి నాడు గంగ యమునా సంగమ ప్రదేశాలలో స్నానం చేయడం మహా పాతక నివారణ.
సముద్ర స్నానం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు :
- అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే వంటికి నూనె రాసుకోకూడదు.
- సముద్రపు నీటితో ఆచమనం చేయకూడదు.
- ఆచమనం విడిగా చేసి సముద్ర స్నానం చేయాలి.
- అశౌచం ఉన్నపుడు సముద్రాన్ని తాకకూడదు.
- పౌర్ణమి గడియలు ఉండగా ఆ సమయంలో అయినా స్నానం చేయవచ్చు. కానీ సూర్యాస్తమయం తరువాత పనికిరాదు.
మహామాఘి విధులు :
- సతీదేవి మాఘ మాసంలోనే జన్మించింది.
- మహా మాఘి నాడు బ్రహ్మ వైవర్త పురాణం దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.
- ఈ రోజు తిలదానం,తిలహోమం, తిల భక్షణం చేస్తే మంచిది అంటారు.
- ఈ రోజు దుప్పట్లు, తైలం, వస్త్రాలు,చెప్పులు, గొడుగు, నెయ్య , బంగారం, అన్నదానం చేయడం వల్ల నవగ్రహ అనుగ్రహం లభిస్తుంది.
- మాఘపౌర్ణమి నాడు సువాసిని పూజ చేస్తే రాబోయే ఏడు జన్మలకు కూడా సౌభాగ్యం వర్ధిలుతుంది.
- ఈ రోజు అమ్మవారిని ఉపవాసంతో ఆరాధించి పాయసం నివేదన చేయాలి. అందువల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని పద్మ పురాణం చెబుతోంది.
2023 : ఫిబ్రవరి 05.
Comments
Post a Comment