మహావైశాఖి
- వైశాఖ పౌర్ణమిని మహావైశాఖిగా పిలుస్తారు.
- ఈ మాసంలో ప్రతి రోజు విష్ణువును అర్చించలేనప్పటికీ పౌర్ణమి రోజైన తులసి దళాలతో పూజించాలి.
- ఈ రోజు ప్రధానంగా సముద్ర స్నానం చేయాలన్నది సంప్రదాయం
- ఈ రోజున అనేక పూజలు జరుపుతారు, ఈ రోజు చేసే దానం మిగతా రోజుల కన్నా అధిక పుణ్యనిస్తాయి అని పురాణాలూ, వ్రతగ్రంధాలు ద్వారా తెలుస్తుంది.
- ఇది వేసవి కాలంలో వస్తుంది కనుక విసనకర్రలు, గొడుగులు, పాదరక్షలు వంటివాటిని దానం చేస్తారు.
- ఈ రోజున నీటి కుండను దానం చేస్తే మంచిఫలితాలు పొందవచ్చు.
- వైశాఖ పౌర్ణమి రోజు కుర్మజయంతి కూడా జరుపుతారు.
- మహాశివుడు శరభ అవతారాన్ని ధరించింది ఈ రోజే.
- దశావతారాలలో రెండవదైన కూర్మావతారాన్ని విష్ణుమూర్తి ఈ పౌర్ణమి నాడే ధరించాడు.
- అన్నమయ్య జయంతి కూడా ఈ పౌర్ణమి నాడే వస్తుంది.
2021 తేదీ : మే 26.
Comments
Post a Comment