వైశాఖ మాసం విశిష్టత - స్కాంద పురాణం
వైశాఖమాసాన్ని మించిన మాసంలేదు. యుగాల్లో కృత యుగాన్ని మించిన యుగం లేదు. అలాగే శాస్త్రాల్లో వేదాన్ని మించింది లేదు. తీర్థాల్లో గంగని మించిన పుణ్యతీర్ధం లేదు.
వైశాఖమాసం శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనది. విష్ణుభగవానుణ్ణి మించిన దైవం ఎలా లేదో, వైశాఖమాసాన్ని మించిన మాసం మరొకటి లేదు. ఎంతో విశిష్టమైన ఈ మాసంలో చేసే దానాలు అఖండమైన, అనంతమైన ఫలితాలనిస్తాయి.
- వైశాఖ మాసంలో జలదానం చేసినవాడికి సకల తీర్థాలనీ సేవించిన పుణ్యఫలితం లభిస్తుంది.
- వైశాఖంలో యాత్రికులకి దాహం తీరిస్తే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి.
- దాహంతో బాధపడేవారికి చల్లటినీళ్ళు దానం చేస్తే పదివేల రాజసూయ యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది.
- వైశాఖంలో మధ్యాహ్న కాలంలో వచ్చిన అతిథికి అన్నదానం చేస్తే విశేషమైన పుణ్యం కలుగుతుంది.
- వైశాఖమాసంలో ఎండలో తిరిగి అలసిపోయి వచ్చిన వారికి సుఖమైన వసతి, భోజనం ఏర్పాటు చేసిన వారికి పునర్జన్మ వుండదు
- వైశాఖంలో పక్కబట్టలు, ధరించే వస్త్రాలు, దానం చేసిన వారికి ఈ జన్మలోనే సుఖభోగాలు లభిస్తాయి.
- పడుకోవటానికి చాపని దానం చేస్తే శ్రీహరి ఆనందిస్తాడు.
- మజ్జిగ ఎండతాపాన్ని చల్లారుస్తుంది. కనుక దాహంతో అలమటించేవారికి మజ్జిగ దానం చేస్తే శ్రీహరి అనుగ్రహం కలుగుతుంది.
- తెల్లటి బియ్యాన్ని దానం చేస్తే ఆయుర్దాయం పెంపొందుతుంది.
- వైశాఖంలో బ్రాహ్మణులకి ఆవు నెయ్యి దానం చేసినవాడు, అశ్వమేధయాగ ఫలితం పొందుతాడు.
- వైశాఖ ప్రతాన్ని ఆచరించేవాడు తామరాకులో భుజిస్తే సకల పాపాలనుంచీ విముక్తుడై విష్ణులోకాన్ని చేరుకుంటాడు.
- వైశాఖమాసంలో నదీస్నానం చేస్తే పుణ్యం వస్తుంది.
- ప్రాతఃకాలంలో సముద్ర స్నానం చేసినవాడు ఏడు జన్మల పాపాల్నీ తొలగించుకోగలుగుతాడు.
- గంగానది, గోదావరి, యమునా, సరస్వతి, కావేరి, నర్మదా, వేణి - ఈ ఏడు నదుల్ని సప్త గంగలంటారు. ఈ మాసంలో ఈ ఏడు నదులలో ఏ గంగలో స్నానం చేసిన కోట్ల జన్మలలో చేసిన పాపం నశిస్తుంది.
చేయకూడని పనులు
- వళ్లంతా నూనె పట్టించి అభ్యంగన స్నానం చేయటం.
- పగటిపూట నిద్రపోవటం
- కంచుపాత్రలో భోజనం చేయటం
- మంచం మీద పడుకోవటం
- ఇంట్లో స్నానం చేయటం
- నిషిద్ధపదార్థాలని (ఉల్లి-వెల్లుల్లి-మాంసాహారం) భుజించటం
- ఎక్కువసార్లు తినటం
- రాత్రిపూట భోజనం చేయటం
Comments
Post a Comment