తిరుమల - జ్యేష్ఠాభిషేకం

  • ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో జ్యేష్టానక్షత్రానికి ముగిసేట్లుగా మూడు రోజులపాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో జరుగుతుంది.
  • దీన్నే "అభిధేయక అభిషేకం" అంటారు.
  • తరతరాలుగా అభిషేకాదులతో అత్యంత ప్రాచీనములైన శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించే నిమిత్తం ఏర్పాటు చేసిన ఉత్సవమే ఇది.
  • ఇది మూడురోజులపాటు జరుగుతుంది 
  • మొదటిరోజు శ్రీ మలయప్పకు వున్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు అభిషేకాలు పంచామృత స్నపనతిరుమంజనాదులు జరిగిన తర్వాత శ్రీస్వామివారికి వజ్రకవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు.
  • యథాక్రమంగా రెండవరోజు ముత్యాల కవచ సమర్పణ చేసి ఊరేగిస్తారు. మూడవరోజు కూడ తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు చేస్తారు. ఈ బంగారు కవచ సమర్పణ మళ్లీ జ్యేష్టాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వుంటారు.
  • ఆర్జిత సేవగా నిర్వహింపబడుతున్న ఈ ఉత్సవంలో భక్తులు పాల్గొనవచ్చు. 
  • ఈ సేవలో పాల్గొన్న భక్తులను కవచంలాగా స్వామి రక్షిస్తాడు.

Comments

Popular posts from this blog

Sri Venkateswara Swamy Temple - Vyalikaval, Bangalore

Sri Raghavendra Swami Aradhana 2024 Dates

Sabarimala Temple Calendar 2024 : Opening & Closing Dates in 2024

Dhanurmasam 2024-25 Dates

Sri Adi Sila Kshetram Temple Brahmotsavams 2024 Dates – Maldkal

Tirumala: March 2025 Quota Details

Paush Month 2024-25 Dates

Tirumala Tirupati Brahmotsavam Dates 2025

Sri Rangam Temple Vaikunta Ekadasi Utsavam 2025 Dates