శ్రీకృష్ణాష్టమి వ్రతం


  • జన్మాష్టమి వ్రతం ఆచరించడం వల్ల ఏడు జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని అగ్ని పురాణం చెబుతోంది. 
  • శ్రీకృష్ణాష్టమి రోజున జన్మాష్టమి వ్రతం ఆచరించాలి. 
  • ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పాపవిముక్తితో పాటు సకల సౌభాగ్యాలు ఐశ్వర్యాలు, సకల విద్యా జ్ఞానం చేకూరుతాయి.

వ్రత విధానం :
  • కృష్ణాష్టమి నాడు సూర్యోదయానికి పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నల్ల నువ్వుల పిండిని శరీరానికి రాసుకోవాలి.ఆపై ఎండు ఉసిరిక పిండితో తల రుద్దుకోవాలి .
  • తులసీదళాలతో కూడిన నీటితో స్నానం చెయ్యాలి.
  • అనంతరం శ్రీకృష్ణ పరమాత్మను పూజించాలి పగలంతా ఉపవాసంతో శ్రీకృష్ణలీలలను చదవాలి.
  • సాయంత్రం తిరిగి స్నానం చేసి వ్రతం చేసుకోవాలి. 
  • ఇది రాత్రివేళ చేయాల్సిన వ్రతం 
  • ఇంటి బయట నుంచి లోపలికి వస్తున్నట్టు చిన్ని పాదాలను చిత్రించాలి. ఇవి కృష్ణుడి పాదాలకు సంకేతంగా భావిస్తారు. 
  • పూజా గృహంలో కానీ, ప్రతం చేయదలచుకున్న ప్రాంతంలో గానీ మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
  • పసుపుకుంకుమలతో అలికి వరిపిండితో  ముగ్గు వేయాలి. 
  • మండప మధ్యభాగంలో బియ్యం పోసి దానిపై కలశాన్ని ప్రతిష్ఠించుకోవాలి.
  • కలశం ముందు శ్రీకృష్ణుడి ప్రతిమను ఉంచాలి.
  • ఇనుము, కత్తి, నీరు, గుమ్మడి పండు, పోకపండు, కరక్కాయ, మారేడు పండు దానిమ్మ పండు, కొబ్బరి కాయ, జాజిపండు ఇలా ఎనిమిది రకాల పళ్లను మండపం ముందుంచాలి.
  • కలశం లో కృష్ణ పరమాత్మను ఆవాహన చేసుకుని షోడశోపచారాలతో అష్టోత్తర శతనామాలతో పూజించాలి.
  • అనంతరం దేవకీ వసుదేవులను, నంద యశోదలను, బలరాముడినీ, భూదేవినీ, రుక్మిణీ సత్యభామలను పూజించాలి.
  • పిండివంటలతోపాటు శ్రీకృష్ణునికి ఇష్టమైన పాలు, మీగడ, పెరుగు, నెయ్యి, వెన్నతో వేయించిన మినప పిండిని నైవేద్యంగా సమర్పించాలి.
  • అనంతరం ప్రతి కథను చదివి వ్రతాన్ని ముగించాలి.

Comments

Popular posts from this blog

Sri Venkateswara Swamy Temple - Vyalikaval, Bangalore

Sri Raghavendra Swami Aradhana 2024 Dates

Sabarimala Temple Calendar 2024 : Opening & Closing Dates in 2024

Dhanurmasam 2024-25 Dates

Sri Adi Sila Kshetram Temple Brahmotsavams 2024 Dates – Maldkal

Tirumala: March 2025 Quota Details

Paush Month 2024-25 Dates

Tirumala Tirupati Brahmotsavam Dates 2025

Sri Rangam Temple Vaikunta Ekadasi Utsavam 2025 Dates