ముంబై గణపతికి రూ.316.40 కోట్లకు ఇన్సూరెన్స్
ముంబైలోని అత్యంత సంపన్నమైన గణేష్ పండల్ - గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ (GSB) సేవా మండల్ - ఈ సంవత్సరం గణేష్ చతుర్థి వేడుకల కోసం రికార్డు స్థాయిలో రూ. 316.40 కోట్ల బీమా కవరేజీని తీసుకున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.
మండల్ సెక్యూరిటీ కోసం న్యూ ఇండియా అస్యూరెన్స్ నుండి బీమాను తీసుకుంది. బంగారం, వెండి ఆభరణాలు మొత్తం కలిపి రూ. 31.97 కోట్లకు రిస్క్ ఇన్సూరెన్స్ పాలసీ పరిధిలోకి వస్తాయి. సెక్యూరిటీ గార్డులు, పూజారులు, వంట మనుషులు, చెప్పుల దుకాణం ఉద్యోగులు, వాలంటీర్లకు వ్యక్తిగత ప్రమాద బీమా విలువ రూ.263 కోట్లు. ఫర్నీచర్, కంప్యూటర్లు, CCTV కెమెరాలు, పాత్రలు, కిరాణా, పండ్లు, కూరగాయలు వంటి ఇతర వస్తువులు, అగ్ని ప్రమాదాలు, భూకంప ప్రమాదాల వంటి వాటి కోసం ప్రత్యేక ప్రమాద పాలసీని తీసుకున్నారు.
ఈ మహా గణపతిని 66 కిలోల కంటే ఎక్కువ బంగారు ఆభరణాలు, 295 కిలోల వెండి మరియు ఇతర విలువైన వస్తువులతో అలంకరించారు.
ఆగష్టు 29 న స్వామి వారు దర్శనమివ్వనున్నారు.
Comments
Post a Comment