వరలక్ష్మి వ్రతం
- శ్రావణమాసంలో పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు.
- ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు
- ఈ వ్రతాచరణ గురించి శివుడు స్వయంగా పార్వతికి చెప్పినట్లు స్కాంద, భవిష్యోత్తర పురాణాలు చెబుతున్నాయి.
- ఈ వ్రతాన్ని ఆచరించడం వల్లనే పార్వతీదేవికి కుమారస్వామి జన్మించాడు.
- ఈ వ్రతం రోజున ఉదయాన్నే ముత్తైదువులు మంగళ స్నానాలను ఆచరించి నూతన వస్త్రాలను ధరించాలి.
- తరువాత పూజకు నిర్ణయించుకున్న స్థలంలో మండపాన్ని ఏర్పరచుకొని దాని మధ్యలో కలశాన్ని నెలకొల్పి లక్ష్మీదేవి ముఖాన్ని తీర్చిదిద్దిన కొబ్బరి కాయను ఆ కలశంపై వుంచాలి.
- అనంతరం లక్ష్మీదేవిని కలశంలోకి ఆహ్వానింపజేసి వ్రతవిధానంతో పూజించాలి.
- మహానివేదనలో వివిధ రకాల పిండివంటలను నివేదించాలి.
- ఈ వ్రతంలో కూడా తోరపూజ తప్పనిసరి.అయితే తోరను తొమ్మిది పొరలుగా వేసుకోవాలి. పూజానంతరం తోరను కుడిచేతికి కట్టుకోవాలి.
- వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైంది.
- ఈ వ్రతాన్ని చేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలూ కలుగుతాయి.
- స్త్రీలు దీర్ఘకాలసుమంగళిగా వుండేందుకు ఈ వ్రతాన్ని తప్పకుండ ఆచరిస్తారు.
వ్రతకథ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
2022 : తేదీ : ఆగష్టు 05.
Post a Comment