మహాలయ అమావాస్య రోజు ఏమి చేయాలి ?
- భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ లేదా సర్వ పితృ అమావాస్యగా పిలుస్తారు.
- ఈ రోజు పూర్వీకులకు శ్రాద్ధం , తర్పణం కర్మలను చేయడం ద్వారా ప్రత్యేక ఫలాలను పొందవచ్చు.
- పితృ పక్షాలు ఈరోజుతో ముగుస్తాయి.
- ఈ రోజు పూర్వీకులకు తర్పణం సమర్పించడం వల్ల పితృ దోషం నుండి విముక్తి లభిస్తుంది.
- ఈ సమయంలో విడిచే తర్పణంతో పూర్వీకులు సంతోషించి తమ వారసులను ఆశీర్వదిస్తారు.
చేయాల్సిన పనులు
- ఈ రోజు ఉదయం నిద్రలేచి స్నానం చేసి పూర్వీకులను జ్ఞాపకం చేసుకుంటూ తర్పణ విడవాలి.
- బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి, లేదా అన్నదానం కూడా చేయవచ్చు
- ఈ రోజు అన్నదానం చేసిన వారి ఆర్ధిక కష్టాలు తీరుతాయి అని నమ్మకం
- ఈ రోజు ఇంటి ఈశాన్యంలో పూజ చేసి ఆవు నెయ్యి దీపం వెలిగిస్తే సమస్యలు దూరం అవుతాయి.
చేయకూడని పనులు
- ఈ రోజున మాసం, ఉల్లిపాయ, వెల్లుల్లిని ఆహారంగా తీసుకోరాదు.
- ఈ రోజున జుట్టు, గోళ్లను కత్తిరించకూడదు, క్షవరం చేయకూడదు.
Comments
Post a Comment