శ్రీ వడక్కునాథ స్వామి ఆలయం - త్రిసూర్
- ఈ ఆలయం కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ అనే పట్టణంలో వెలసింది.
- ఈ క్షేత్రానికి పూర్వం తిరుశివవేరూర్, వృషాచలం అనే పేర్లు ఉండేవి
- తిరు అంటే శ్రీ, లక్ష్మీదేవి రూపం
- ఈ ఆలయంలో శ్రీమహావిష్ణువు శంకరనారాయణుడిగా శివుడితో కొలువై ఉన్నాడు.
- పురాణ కాలం నుండే ఈ స్వామి పూజలు అందుకుంటున్నాడు
- ఆదిశంకరుల తల్లితండ్రులు స్వామివారిని పూజించిన తరువాత శంకరులు జన్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది.
- సుమారు 9 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయం ఉంది.
- గర్బాలయంలో స్వామివారు నెయ్యతో కప్పబడి ఉంది పది అడుగుల ఎత్తులో దర్శనమిస్తారు.
- అనేక సంవత్సరాల నుండి స్వామివారి మీద పోసిన నెయ్య అలాగే నిలిచి ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
- ఎప్పుడైనా నెయ్య కరిగితే దానిని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.
- స్వామివారి ఆలయం వెనుక తూర్ప అభిముఖంగా పార్వతీదేవి కొలువుదీరి ఉంది.
- శంకరనారాయణ స్వామి, వినాయక స్వామి, శ్రీరాములవారు ఆలయ ప్రధాన ప్రాంగణంలో దర్శనమిస్తారు.
- ప్రాకార ప్రదక్షిణ మార్గంలో అయ్యప్పస్వామి, శ్రీకృష్ణుడు, ఆదిశంకరుల ఉపాలయాలు వున్నాయి.
- ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతావృక్షాలు దర్శనమిస్తాయి.
- ఈ ఆలయంలో ఏప్రిల్, మే నెలలో పూరం ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది.
- మహాశివరాత్రి, ఓనం , శ్రీరామనవమి, శంకర జయంతి వంటి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి.
స్థల పురాణం
పరశురాముడు ఈ ప్రాంతంలో కళ్ళు మూసుకొని కొంత సమయం ధ్యానంలో నిమగ్నమయ్యాడు. అనంతరం కళ్ళు తెరిచి చూడగా కళ్ళెదుట శ్రీమహావిష్ణువు విగ్రహరూపంలో దర్శనమిచ్చాడు. తాను శివుడిని కొరితే విష్ణువు దర్శనం ఇవ్వడంతో పరశు రాముడు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి శివుడి కోసం మళ్లీ ధ్యానం చేశాడు. కొద్దిసేపటికి కళ్లు తెరిచి చూడగా పరమేశ్వరుడు శివలింగరూపంలో దర్శనమివ్వగా పరశు రాముడు స్వామిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించి మళ్లీ ధ్యాన నిమగ్నుడయ్యాడు. తర్వాత కళ్లు తెరిచి చూసిన పరశురాముడికి శంకర నారాయణుడు దర్శనమివ్వడంతో ఆ స్వామిని ప్రతిష్టించి పూజలు నిర్వహించడంతో పాటు విశ్వకర్మ పరమాత్మచేత ఆలయాన్ని నిర్మింపచేశాడు.
ఆలయ వేళలు
ఉదయం 6.00 నుండి మధ్యాహ్నం 12.00 వరకు
సాయంత్రం 4.30 నుండి రాత్రి 8.00 వరకు
ఎలా వెళ్ళాలి :
కొట్టాయం నుండి 138 కి.మీ
గురువాయూర్ నుండి 30 కి.మీ
తిరువనంతపురం నుండి 300 కి.మీ
Post a Comment