ఏకాదశి మహిమ | ఏకాదశి రోజు ఏమి చేయాలి | ఏకాదశి రోజు ఏమి తినాలి | ఏకాదశి వ్రత ఫలితాలు

 

ఏకాదశి తిధి పరమ పవిత్రమైనదిగా వర్ణించబడింది,ఈ వ్రతాన్ని ఆచరించడం పరమశ్రేష్ఠమైన కార్యం.దీనిని ఆచరించిన వారికీ పునర్జన్మ ఉండదు అని, వైకుంఠలోకం ప్రాప్తిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి.

ప్రతినెలలో రెండు ఏకాదశీలు వస్తాయి, అంటే ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశీలు, అధిక మాసమైతే ఇరవై ఆరు ఏకాదశీలు సంభవిస్తాయి. ఈ వ్రతాన్ని అందరు ఆచరించవచ్చు. 80 ఏళ్లు దాటిన వృద్దులు, చిన్న పిల్లలు, అనారోగ్యంతో బాధపడే వారు ఈ వ్రతాన్ని ఆచరించక పోయిన దోషం లేదు. 

ఏకాదశిని హరివాసరం, మాధవ తిధి అనే పేర్లుతో కూడా పిలుస్తారు. ఈ వ్రత ముఖ్యప్రయోజనం సమస్త ఇంద్రియాల ద్వారా శ్రీహరిని సంపూర్తిగా ప్రసన్నుని చేయడమే.ఈ రోజు ఉపవాసము చేయాలి అంటే అర్ధము "దగ్గరగా వసించడము". 


వ్రత విధానం 

ముందురోజు అనగా దశమినాటి రాత్రిపూట ఉపవాసం ఉండాలి.

తెల్లవారుజామునే బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి, ఇతర కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఇంట్లో పూజ చేసి ఆలయం దర్శించాలి.

ఏకాదశి వ్రత మహత్యం తప్పక చదవాలి లేదా వినాలి.

ఈరోజు ఉపవాసం ఎంత ముఖ్యమో ద్వాదశి రోజు (అంటే పక్క రోజు)ఉపవాసాన్ని ముగించడం అంతే ముఖ్యం.దానికి సమయాలు ఉంటాయి.

ద్వాదశి రోజు వరి, గోధుమలతో చేసిన ప్రసాదాన్ని భగవంతునికి తులసి వేసి నివేదన చేసి, ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ఉపవాసాన్ని విరమించాలి.

ఈ రోజు "హరే రామ హరే కృష్ణ" నే మహామంత్రం జపం చేయాలి, భగవద్గిత, భాగవతం శ్రవణం చేయాలి.


తినకూడనివి :

బియ్యం,గోధుమలు, పప్పులు, బఠాణీలు చిక్కులు వంటి కూరగాయలు.మసాలా దినుసులు, రవ్వ, శెనగపిండి, తేనె ఆవాలు,మెంతులు పోపు వాడకూడదు.

నెయ్యి, వేరుశెనగ, అల్లం, పచ్చిమిర్చి వాడవచ్చును.

ఏకాదశి రోజు అన్నం తినకూడదు అని శాస్త్రాలు, పురాణాలు ఘోషిస్తున్నాయి. 

ఈ రోజు పండ్లు, కూరగాయలు తినడం వ్రతభంగం కాదు అని మహాభారతం చెబుతుంది.

కఠిన ఉపవాసం చేసే వారు నీరు కూడా తాగరు. కొంత మంది నీరు మాత్రమే తాగుతారు.

బాదంపప్పు, జీడిపప్పు, వేరుశెనగలు ఆహారంగా తినవచ్చు. ఆలుగడ్డ, గుమ్మడికాయ, దోసకాయలు బొప్పాయిపండు, పనసపండు, కొబ్బరికాయ అన్ని రకాల పండ్లు పాలపదార్దాలు తినవచ్చు. ఏకాదశి రోజు ఆహారం ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే తినాలి. 


చేయకూడనివి :

ఏకాదశినాడు క్షవరం చేసుకోవడం, గోళ్లు తీసుకోవడం నిషిద్ధం.

దశమి,ఏకాదశి, ద్వాదశి మూడురోజులు బ్రహ్మచర్యం పాటించాలి.

ఏకాదశి వ్రతమహిమ :

మహారోగాలను నయం చేస్తుంది, సమస్యలు తొలగిపోయి శాంతి చేకూరడానికి ఈ వ్రతం పరమఔషదం.

సంసారమనే విషసర్పం కాటు నుండి మనిషి బయటపడతాడు, సమస్త పాపాల నుండి విముక్తి లభిస్తుంది.

నూరు జన్మల పాపంకూడా క్షణములో నశిస్తుంది.

నెలలో రెండు ఏకాదశులు శ్రద్ధగా పాటించే భక్తులు వైకుంఠాన్ని చేరుకుంటారు.

ఒక ఏకాదశి తిధి అయిన యధావిధిగా పాటిస్తే అతడు దానాలు గాని, తపస్సులు గాని, తీర్థయాత్రలు గాని చేసే అవసరమే ఉండదు.

ఉపవాసం ముఖ్య ఉద్దేశం.

కేవలం తినకుండా ఉండడమే కాదు, గోవిందుని గురించి వినడానికి, కీర్తించడానికి మరింత సమయం వినియోగించడమే ఈ ఉపవాసం ఉద్దేశం.ఈ రోజు సకల పాపకర్మలకు దూరంగా వుంది, గృహసంబంధకార్యాలను పక్కనపెట్టి, ఇంద్రియభోగాలను విడిచి పెట్టి ఉపవాసంవుంటూ భగవంతునికి దగ్గరగా నివసించవలెను.

ఉపవాసం వల్ల ప్రయోజనం :

ఈ జన్మలోనే ఆనందాన్ని అనుభవించి, తరువాతి జన్మ లేకుండా ముక్తి పొందవచ్చు.

అనేక జన్మలలో చేసిన పాపాలనుండి విముక్తి పొందవచ్చు.

ఏకాదశి రోజు విష్ణువుని తులసి దళములతో ఆరాదిస్తే 'వాజ పేయ' యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది.

లక్షల ఏళ్లు చేసిన యజ్ఞాలు, తపస్సులు ఒక్క ఏకాదశివ్రత ఫలితానికి సమానం కాలేవు.

ఈ జన్మలోనే పేరు ప్రఖ్యాతలు వస్తాయి.

శ్రద్ధతో చేస్తే అశ్వమేధయాగం చేసిన ఫలితం వస్తుంది.

స్వర్గలోకం వంటి వున్నత లోకాలు పొందవచ్చు.

నిస్వార్థంతో ఆచరిస్తే అష్టఐశ్వర్య, ధనధాన్యాది సిరిసంపదలు సమకూరుతాయి.

బ్రహ్మహత్యా పాతకాలనుండి బయటపడవచ్చు.

ఈ వ్రత మహత్యాన్ని వింటే 'జ్యోతి షోత్తమ' యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది.

Comments

Popular posts from this blog

Sabarimala Temple Calendar 2024 : Opening & Closing Dates in 2024

Thiruvannamalai Karthigai Deepam Festival - 2024 Dates

Sri Azhagiya Singar Perumal Temple Timings – Kanchipuram

Sri Kalabhairava Temple Brahmotsavam 2024 Dates - Isannapalli, Kamareddy

Sri Maisigandi Maisamma Jatara Dates 2024 – Kadthal.

Sri Lakshmi Narsimha Swamy Brahmotsavam 2024 - Ahobilam

Tirumala: Kaisika Dwadasi on November 13

Sri Kurumurthy Jatara/Brahmotsavams Dates 2024