దేవత ప్రతిష్ఠ, గృహప్రవేశం, ఉపనయనం , వివాహం లాంటి శుభకార్యాలకు ఉత్తరాయనమే మంచిది అంటారు.అందుకే శుభకార్యాలు అన్ని ఉత్తరాయణంలోనే చేస్తుంటారు.
దక్షిణాయనం శుభకార్యాలకు అంత మంచిది కాదంటారు.
దక్షిణాయనంలో ఉగ్రదేవత రూపాలను అంటే భైరవ, వరాహ , నరసింహ, మహిషాసురమర్దిని, దుర్గ, సప్తమాత్రుల వంటి దేవతామూర్తులను, గ్రామదేవతలను ప్రతిష్టించవచ్చు అన్ని వైఖానస సంహిత చెబుతోంది.
ఉత్తరాయణంలో చనిపోయినవారు వెంటనే స్వర్గలోకాన్ని చేరుకుంటారు అని, దక్షిణాయనములో చనిపోయిన వారు ఉత్తరాయణం వచ్చేవరకు స్వర్గద్వారాల వద్ద వేచి వుంటారు అని చెబుతారు.
Post a Comment