Kosuvaripalle: శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2023
టిటిడికి అనుబంధంగా ఉన్న తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలో వెలసిన శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జనవరి 22 నుండి జనవరి 30వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. జనవరి 21వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
జనవరి 22 - ధ్వజారోహణం, పల్లకీ ఉత్సవం
జనవరి 23 - పెద్దశేషవాహనం, హంసవాహనం
జనవరి 24 ముత్యపుపందిరి వాహనం, సింహవాహనం
జనవరి 25 కల్పవృక్ష వాహనం, హనుమంత వాహనం
జనవరి 26 సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం
జనవరి 27 సర్వభూపాల వాహనం, కల్యాణోత్సవం, గరుడవాహనం
జనవరి 28 రథోత్సవం, గజ వాహనం
జనవరి 29 పల్లకీ ఉత్సవం, అశ్వ వాహనం
జనవరి 30 చక్రస్నానం, ధ్వజావరోహణం
జనవరి 31వ తేదీ ఆలయంలో పుష్పయాగం సాయంత్రం 5.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు ఘనంగా జరుగనుంది.
Comments
Post a Comment