Phalguna Month: పాల్గుణ మాసం విశిష్టత
- వినీల ఆకాశంలో ,శ్వేత వర్ణంతో దండకారంగా ప్రకాశిస్తున్న రెండు నక్షత్రాలతో కూడిన మండలమే ఫల్గుణి నక్షత్రం.
- చాంద్రమానంలోని పన్నెండు మాసాలలో పాల్గుణమాసం చివరిది.
- ఈ నెలలోని పౌర్ణమినాడు చంద్రుడు పూర్వఫల్గుణి లేదా ఉత్తరఫల్గుణి నక్షత్రానికి దగ్గరగా ఉండటం చేత ఇది పాల్గుణమాసం అయింది.
- ఆరు ఋతువులలో ఆఖరిదైనా శిశిర ఋతువు ఈ మాసంతో ముగుస్తుంది.
- సూర్యుడు ఫాల్గుణ మాసంలో మీనా రాశిలో ప్రవేశిస్తాడు.
- ఈ మాసం విష్ణువుకు ప్రీతికరం అని భాగవతం చెబుతోంది.
- ఈ నెలలో విష్ణువుని పూజించడం విశేష ఫలదాయకం.
- ఈ మాసంలో చేసే దానాల వల్ల గోవిందుని అనుగ్రహం లభించి అరిష్టాలు హరింపబడుతాయి.
- ఈ మాసంలో గోదానం చెప్పలేనంత ఫలితాన్నిస్తుంది.
- పాల్గుణ పాడ్యమి రోజునే రామ, రావణ యుద్ధంలో ముఖ్య ఘట్టం.
- రావణ సంహారం జరిగింది పాల్గుణ అమావాస్య.
- మహాభారతంలో ధర్మరాజు, భీమసేనుల జననం ఈ మాసంలోనే జరిగింది.
- భారతంలో ప్రతి నాయకుడైన దుర్యోధనుడు అతని సహోదరుడైన దుశ్యాసనుడు ఈ మాసంలోనే జన్మించారు.
- ఫాల్గుణ శుద్ధ పాడ్యమినాడు గుణావాప్తి వ్రతం, తదియనాడు మాధుక వ్రతం చేస్తారు.
- ఈ మాస శుద్ధ చవితిని తిల చతుర్థి అని అంటారు. ఈ రోజు ఉపవాసం చేసి తిలాన్నంతో హోమం చేసి బ్రాహ్మణ భోజనానంతరం భుజించాలి దీని వల్ల సర్వ విజ్ఞాలు నశిస్తాయి. ఈ రోజు పుత్ర గణపతి వ్రతం ఆచరించిన వారికీ సంతానం కలుగుతుంది.
- పంచమి నాడు అనంత పంచమి వ్రతాన్ని, సప్తమి నాడు ఆర్కాసంపుట సప్తమిని ఆచరించాలి.
- పాల్గుణ శుద్ధ అష్టమి లక్ష్మిదేవికి ప్రీతికరమైన రోజు. ఈనాడు లక్ష్మీదేవిని, సీతాదేవిని అర్చించి, ప్రదోష సమయంలో దీపారాధన చేస్తే సౌభాగ్యం, సంపద కలుగుతాయి.ఈ రోజు లలితకాంతిదేవి వ్రతం చేస్తారు.
- నవమినాడు ఆనందనవమిని, ఏకాదశిని అమలక ఏకాదశిగా నిర్వహిస్తారు.
- శుద్ధ ద్వాదశి విష్ణు ప్రీతికరమైన తిధి. దీన్నే నృసింహ ద్వాదశి అని అంటారు. శ్రీ నృసింహ ఆరాధన చేస్తే అభిష్టసిద్ధి కలుగుతుంది.ఈ పర్వాన్ని కామదాహాని అని కూడా అంటారు. ఈ రోజు గ్రామ క్షేమం కోసం మన్మధ విగ్రహ దహనం చేస్తారు.
- శుద్ధ చతుర్దశికి మహేశ్వర వ్రతం చేయాలి.
- హోళికా పూర్ణిమ నాడు పగలు గోక్రీడలు, సాయంత్రం హోలీ ఉత్సవం నిర్వహిస్తారు.ప్రదోష సమయంలో దీపం వెలిగించి లక్ష్మీనారాయణ అర్చన చేస్తే సర్వ సంపదలు శుభాలు కలుగుతాయి.
- పౌర్ణమి తరువాత వచ్చేది పాడ్యమి ఆరోజు ధూళి వందనం చేయాలి.
- పాల్గుణ మాసంతో శీతాకాలం ముగిసి, వసంత కలం ప్రారంభం అవుతుంది.
- పాల్గుణ మాసంలో దేవత ఆరాధన, ఉత్సవాలతో పాటు పితృ ఆరాధన కూడా చేయాలనీ శాస్త్రం.
- పాల్గుణ మాసంలో ప్రవచనాలు వినడం, దేవాలయాలను సందర్శించడం మంచిది.
2023: ఫిబ్రవరి 21 నుండి మార్చి 21 వరకు.
Post a Comment