శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు 2021 తేదీలు
పదిహేడో శతాబ్దంలో జన్మించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి బనగానపల్లి వాసులకు కాలజ్ఞానాన్ని వినిపించారు. కలియుగంలో జరగబోయే సంఘటనలు తెలిపారు.
1693 లో జీవసమాధిలోకి ప్రవేశించారు. కందిమల్లయ్య పల్లెలోని శ్రీ బ్రహ్మంగారిమఠంలో వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామి వారి ఆరాధనోత్సవాలు జరుగుతాయి. 32 రోజులు దీక్షను ధరించిన భక్తులు ఆరాధన సమయంలో దీక్ష విరమణ చేస్తారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొంటారు.
ఉత్సవ తేదీలు 2021
మే 22 - వైశాఖ శుద్ధ దశమి - స్వామివారి ఆరాధన
మే 23 - పుష్ప రథోత్సవం
మే 24 - మహా ప్రసాదం నివేదన
కరోనా దృష్ట్యా ఈ సారి ఉత్సవాలను రద్దు చేసారు.
Comments
Post a Comment