శ్రీ కురుమూర్తి వేంకటేశ్వర దేవస్థానం - అమ్మాపూర్
- శ్రీ కురుమూర్తి వేంకటేశ్వర ఆలయం మహబూబ్‌నగర్ జిల్లాలోని అమ్మాపూర్ గ్రామం తెలంగాణ రాష్ట్రంలో ఉంది.
- ఇది రాష్ట్రంలోనే అతి పురాతన ఆలయాలలో ఒకటి
- ఈ ఆలయం పేదల తిరుపతిగా ప్రసిదిచెందింది.
- 12 , 13 శతాబ్దాల మధ్య ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది.
- తిరుమల స్వామికి, ఈ స్వామికి పోలికలు ఉన్నట్లు చెబుతారు.
- వేంకటాచలంతో స్వామి నిల్చున్న భంగిమల్లో ఉండగా కురుమూర్తి స్వామి అదే భంగిమలో ఉండడం విశేషం.
- కురుమూర్తి దేవ స్థానానికి దళితులకు విడదేయరాని బంధం ఉంది. స్వామి వారి పాదుకలను వడ్డెమాన్‌లోని ఉద్దాలలో రాయలసీమ ప్రాంతం నుంచి సేకరించిన నాణ్యమైన ఆవు చర్మంతో పాదుకలను దళితులు తయారు చేస్తారు.
- దీపావళి అమావాస్య రోజు నుంచి 7 రోజుల పాటు నియమనిష్ఠలతో ఉపావాస దీక్షలతో స్వామి పాదుకలు ఉద్ధాలు చేస్తారు. వారి పూజలు అనంతరం ఉద్దాలను ఊరేగింపుగా కురుమూర్తి దేవస్థానానికి తీసుకెళ్తారు.
- ఈ ఆలయంలో కార్తీక మాసంలో 19 రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి
ఇక్కడ కూడా ఆ స్వామి ఏడు కొండలపైనే కొలువుదీరడం విశేషం. ఆ కొండల వివరాలు…
1. శేతాద్రి (బొల్లిగట్టు), 2. ఏకాద్రి (బంటి గట్టు),
3. కోట గట్టు, 4. ఘనాద్రి (పెద్ద గట్టు), 5. భల్లూకాద్రి (ఎలుగులగట్టు), 6. పతగాద్రి (చీపుర్లగట్టు)
7. దైవతాద్రి (దేవరగట్టు)… అనే ఏడు కొండల్లో దేవతాద్రి అని పిలిచే దేవరగట్టపైనే కురుమూర్తి వేంకటేశ్వర స్వామి కొలువై విరాజిల్లుతున్నారు.
స్థల పురాణం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారు ఇక్కడకు రావడానికి రెండు రకాల పురాణ గాథలు ఉన్నాయి. ఇందులో తిరుపతి నుంచి కురుమూర్తి అమ్మాపూర్ రావడానికి కారణం కుబేరుని అప్పుల బాధ నుండి తప్పించుకోవడానికి. తిరుపతి నుంచి ఇక్కడికి ఉత్తరముఖంగా వస్తున్న సమయంలో సుగంధ భరితమైన అనేక ఫల పుష్పాలతో కనబడిన గుట్టపై కాసేపు విశ్రమిద్దామనే లక్ష్మీదేవి కోరిక మేరకు స్వామి ఇక్కడ ఆగినట్టు పురాణ గాథ. ఇక్కడ ‘కురు’ అనగా చేయుట, ‘మతి’ అనగా తలచుట అని అర్థం. అందుకే ఈ స్వామికి ‘కురుమతి’ అని పేరు వచ్చింది. కాలక్రమేణా అది ‘కురుమూర్తి’గా స్థిరపడి పోయినట్లు పూర్వీకులు చెబుతుంటారు. దాదాపు 900 సంవత్సరాల నుండి స్వామి వారు పూజలు అందుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి.
ఆలయ వేళలు
ఉదయం 6.00 నుండి రాత్రి 8.00 వరకు
ఎలా వెళ్ళాలి
హైదరాబాద్ నుండి 190 కి.మీ
గద్వాల్ నుండి 44 కి.మీ
Comments
Post a Comment