మినీ మేడారం జాతర 2023
సమ్మక్క, సారలమ్మ కు ఇష్టమైన మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఫిబ్రవరి 1వ నుంచి 4వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా మినీ జాతర జరగనుంది.
తెలంగాణలో ప్రముఖ గిరిజన జాతర సమ్మక్క – సారలమ్మ జాతర.. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ ఈ జాతర ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో జరుగుతుంది. ఈ జాతర కుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు.ఫిబ్రవరిలో మినీ మేడారం జాతరను నిర్వహించనున్నారు. సమ్మక్క, సారలమ్మ కు ఇష్టమైన మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఫిబ్రవరి 1వ నుంచి 4వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా మినీ జాతర జరుగుతుంది.
ఫిబ్రవరి 1న మండమెలిగే పండగ నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 2న సారలమ్మ అమ్మవారి గద్దెను శుద్ధి చేస్తారు.
ఫిబ్రవరి 3వ తేదీన సమ్మక్క అమ్మవారి గద్దె శుద్ధి చేస్తారు.
అనంతరం భక్తులు తమ మొక్కులను తీర్చుకునేందుకు అనుమతిస్తారు. ఈ మినీ మేడారం జాతరలో వన దేవతలను గద్దెలపైకి తీసుకురారు. మిగిత పూజా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి.
Comments
Post a Comment