Maha Shivaratri: శివయ్య పూజలో చేయాల్సినవి, చేయకూడనివి
సనాతన ధర్మం ప్రకారం.. మహా శివరాత్రి రోజున శివ పార్వతుల కళ్యాణం జరిగింది. శివరాత్రి రోజున శివభక్తులు శివాలయానికి వెళ్లి రోజంతా ఉపవాసం ఉండి శివలింగానికి శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలు, గంగాజలం, పాలు, పెరుగు, ఉమ్మెత్త పువ్వులు వంటి వాటితో అభిషేకం చేస్తారు.
మహా శివరాత్రి నాడు ఏమి చేయాలంటే.. మహా శివరాత్రి నాడు ఉదయాన్నే స్నానమాచరించి, ఉపవాస దీక్ష చేపట్టి పూజించాలి. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించిన తరువాత ఇంటికి సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్లి శివలింగానికి జలాభిషేకం చేయండి. శివయ్యకు జలాభిషేక సమయంలో శివలింగంపై బిల్వ, జమ్మి, పాలు, గంగాజలం, పువ్వులు, తేనె, ఉమ్మెత్తను సమర్పించండి. అంతేకాదు మహాశివరాత్రి రోజున మహామృత్యుంజయ మంత్రంతో పాటు అన్ని శివ మంత్రాలను పఠించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
మహా శివరాత్రి నాడు ఏమి చేయకూడదంటే.. మహా శివరాత్రి రోజున మాంసం, మద్యం, ఉల్లి-వెల్లుల్లి వంటివి తీసుకోకూడదు. అంతేకాదు శివాలయంలో కొన్ని వస్తువులను సమర్పించడం నిషేధం. తులసి ఆకులు, పసుపు, కుంకుమ, కొబ్బరి నీళ్లు సమర్పించకూడదు. అంతేకాదు కాదు.. శివలింగ పూజలో శంఖాన్ని ఉపయోగించకూడదు.
మహా శివరాత్రి శుభ సమయం మహా శివరాత్రి రోజున శివయ్యను నాలుగు దశల్లో పూజించాలని హిందూ మత గ్రంథాల్లో పేర్కొనబడింది మొదటి ప్రహర పూజ సమయం: ఫిబ్రవరి 18, 06:41 PM నుండి 09:47 PM వరకు రెండవ ప్రహర పూజ సమయం: 09:47 PM నుండి 12:53 PM మూడవ ప్రహార పూజ సమయం: ఫిబ్రవరి 19, 12:53 PM 03:58 నుండి 4 వరకు: 00 a.m. ఆరాధన సమయం: ఫిబ్రవరి 19, ఉదయం 03:58 నుండి 07:06 వరకు.
Comments
Post a Comment