ధనత్రయోదశి
- ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ధన త్రయోదశి ని జరుపుకుంటారు.
- అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ధన త్రయోదశి నాడు లక్ష్మి దేవి ఉద్బవించినట్టు పురాణాలూ చెబుతున్నాయి.
- చతుర్వర్గ చింతామణి అనే ధర్మగ్రంధంలో ఈ ధన త్రయోదశికి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి.
- ఉత్తర భారత దేశం ఈ పండుగను బాగా జరుపుకుంటారు. ధన్ తెరేష్ అని పిలుస్తారు.
- ఈ రోజు బంగారం కొనడం ఆచారం, ఈ పండుగను ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి ప్రతీకగా నిర్వహిస్తారు.
- ఈ రోజు ఇళ్లను సుందరంగా అలంకరిస్తారు
- తెల్లవారుజామునే స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు.
- ధన త్రయోదశి రోజున లక్ష్మి పూజతో పాటు గోత్రిరాత్ర వ్రతాన్ని కూడా చేస్తారు.
- ఈ రోజు లక్ష్మీదేవి పూజించడం మాత్రమే కాక పితృదేవతలకు సంబందించిన పుణ్యకార్యాలు చేయడం కూడా కనిపిస్తుంది.
- ఈ రోజు ఇంట్లో ఒక దీపమైన వెలిగించడం సంప్రదాయం.
- ధన త్రయోదశి నాడు సాయంత్రం వేళ ఇంటి ముందు రహదారిపై దక్షిణ దిక్కుగా దీపం ఉంచుతారు.
- రోడ్డు మీద దక్షిణ దిక్కుగా పెట్టె దీపాలను మాత్రం తల్లితండ్రులు గతించిన ఇళ్లలోని యజమాని స్వయంగా వెలిగిస్తాడు.
- నూనెతో దీపాన్ని వెలిగించి దానిని పూజించి ఇంటికి ఎదుట వెలుపలి భాగంలో ఉంచాలి. ఇలా ఉంచిన దీపానికి యమదీపం అని పేరు.
2021 : 2 నవంబర్.
Comments
Post a Comment