మాఘ గుప్త నవరాత్రి 2023

మాఘ గుప్త నవరాత్రి తొమ్మిది రోజుల పండుగ శక్తి యొక్క రూపంగా దుర్గాదేవి ని పూజిస్తారు. అయితే ఏడాదికి నాలుగు నవరాత్రులు వస్తాయి. అయితే చైత్ర , శారద నవరాత్రుల సమయంలో ప్రజలు ఎక్కువగా వేడుకలను జరుపుకుంటారు. అయితే మాఘ మరియు ఆషాఢ మాసాలలో కూడా నవరాత్రుల పండుగ వస్తుంది. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. ఇక మాఘమాసం లో వచ్చే గుప్తా నవరాత్రులను గాయత్రి ‘శిశిర్ నవరాత్రి’ అని కూడా పిలుస్తారు.

భండాసురుడనే రాక్షసుడిని చంపడానికి ఆది పరాశక్తి శ్రీలలితా దేవి గా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో  శ్యామలాదేవిని సృష్టించింది. 16 మందిలో ముఖ్యమైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమంచింది లిలాతదేవి. అందుకే  శ్యామలాదేవిని  మహామంత్రిణీ దేవి అని కూడా అంటారు. ఈ తల్లిని దశ మహా విద్యల్లో  మాతంగి అని పిలుస్తారు.

హిమవంతుని స్నేహితుడైన మతంగముని తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేర మాతంగుడి కుమార్తెగా జన్మించి మాతంగిదేవిగా ప్రసిద్ధి చెందింది. ఈవిడకు  నీల సరస్వతి,  గేయ చక్ర వసిని, లఘు శ్యామల, వాగ్వాధిని శ్యామల, నకుల శ్యామల, హసంతి  శ్యామల, సర్వసిద్ది మాతంగి, వాస్య మాతంగి, సారిక శ్యామల, శుక శ్యామల, రాజ మాతంగి అని ఎన్నో నామాలున్నాయి.

మొదటి రోజు మాఘ గుప్త నవరాత్రి సమయంలో భక్తులు తెల్లవారుజామున లేచి ఉదయాన్నే స్నానం చేస్తారు. అనంతరం ఘటాస్థాపన చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో దేనిని కలశ స్థాపన అని కూడా అంటారు.

నవరాత్రి సమయంలో ముఖ్యమైన ఆచారాలలో ఘటస్థాపన ఒకటి.  ఈ రోజు నుంచి దుర్గాదేవిని పూజను తొమ్మిది రకాలుగా పూజిస్తారు  నవరాత్రి మొదటి రోజు నీరు లేదా ముడి బియ్యంతో నిండిన కలశాన్ని , కొబ్బరి, మామిడి ఆకులతో అలంకరించి దుర్గాదేవిని ఆరాధించి  అనంతరం భక్తులు తమ శక్తి కొలదీ దేవికి ధూపదీప నైవేద్యాలను అర్పిస్తారు.

2023 తేదీలు 

జనవరి  22  - ఘటస్థాపన,శైలపుత్రి  పూజ

జనవరి  23 - బ్రహ్మచారిణి  పూజ

జనవరి  24 - చండ్రగుంట  పూజ.

జనవరి   25 - కుశమండ పూజ

జనవరి  26 - స్కంద మాత పూజ

జనవరి  27 -  కాత్యాయనీ పూజ

జనవరి  28 -  కాల రాత్రి పూజ

జనవరి  29 -  మహాగౌరి, సంధి పూజ

జనవరి  30 -  సిద్ధిదాత్రి  పూజ.

అయితే మాఘ గుప్త నవరాత్రి పండుగ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుపుకుంటారు. ప్రధానంగా ఉత్తర భారత రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఘనంగా జరుపుకుంటారు. ఈ గుప్త నవరాత్రులను  దేవత కోపాన్ని తగ్గించేందుకు జరుపుకుంటారు. ఈ సమయంలో దేవి తన భక్తులకు ఆరోగ్యం, శ్రేయస్సు, జ్ణానం , సానుకూల శక్తులను ప్రసాదిస్తుంది. గుప్త నవరాత్రుల సమయంలో అన్ని రకాల భయాలు మరియు ఆందోళనలు తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం. 

No comments