చొల్లంగి అమావాస్య

  • పుష్యమాసానికి చివరి రోజైన అమావాస్యని చొల్లంగి అమావాస్య అని అంటారు.
  • కాకినాడ నగరం నుంచి యానాం వెళ్ళేదారిలో  జగన్నాధపురం వంతెనకు నాలుగు కిలోమీటర్ల దూరంలో చొల్లంగి గ్రామం ఉంది. 
  • అక్కడే గోదావరి నది ఏడుపాయలలో ఒక్కటైనా తులాభాగ్య సముద్రంలో కలుస్తుంది.
  • తులాభాగ్య మహర్షి తీసుకువచ్చిన  ఈ పాయ సముద్రంలో కలిసిన రోజు పుష్య అమావాస్య.
  • సప్తసాగర యాత్ర చేసేవారు చొల్లంగి అమావాస్య నుంచి ప్రారంభిస్తారు.
  • పుష్య అమావాస్యకు చొల్లంగి తీర్థంలో అప్పన్న ఎద్దుల్ని ఊరేగిస్తారు. 
  • గోదావరి ఏడుపాయలు సముద్రంలో కలిసే ప్రాంతాలలో స్నానం చేస్తూ పదిహేను రోజుల తరువాత వచ్చే పౌర్ణమినాడు అంతర్వేది వద్ద స్నానం చేస్తారు. 
  • మాఘ పౌర్ణమి రోజు జరిగే అంతర్వేది తీర్థం ముందే చొల్లంగి తీర్థం నిర్వహిస్తారు.
  • బంగారులేడి రూపంలో మారీచుని తరుముకుంటూ వచ్చిన రామచంద్రమూర్తి వేసిన బాణం మారీచుడికి తగిలింది. వాడి మొండెం తూరంగిలో, తల కోరంగిలో. రాముడు బాణం రెండింటికి మధ్య చొల్లంగిలో పడింది అంటారు.
  • ఇదే రోజు పరమశివుడు నందీశ్వరుడికి మోక్షం ప్రసాదించాడు అని చెబుతారు.
  • చొల్లంగిలో వందయేళ్ల క్రితం నిర్మించిన శ్రీబాలా త్రిపురసుందరి దేవి సమేత సంగమేశ్వర దేవస్థానం ఉంది.
  • అన్ని తీర్థాలలోను స్నానం చేసే భక్తులతో చొల్లంగి తీర్థం కళకళలాడుతుంది. 


2023: జనవరి  21.

Comments

Popular posts from this blog

Sri Venkateswara Swamy Temple - Vyalikaval, Bangalore

Sri Raghavendra Swami Aradhana 2024 Dates

Sabarimala Temple Calendar 2024 : Opening & Closing Dates in 2024

Dhanurmasam 2024-25 Dates

Sri Adi Sila Kshetram Temple Brahmotsavams 2024 Dates – Maldkal

Tirumala: March 2025 Quota Details

Paush Month 2024-25 Dates

Tirumala Tirupati Brahmotsavam Dates 2025

Sri Rangam Temple Vaikunta Ekadasi Utsavam 2025 Dates