శ్రీ ముండ్కతీయ ఆలయం - ఉత్తరాఖండ్.

 

ఈ ఆలయం ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది.

కేదార్ లోయ ఒడిలో నెలకొని ఉన్న ఈ ఆలయం దేశంలోనే తలలేని గణేశుడి విగ్రహాన్ని పూజించే ఏకైక ఆలయంగా పేరుగాంచింది.

‘ముండ్’ అంటే తల, కాత్య అంటే విచ్ఛేదనం.

శివ పురాణం ప్రకారం గణేశుడు తన తల్లి పార్వతి ఆదేశాలను అనుసరించి, శివుడిని గదిలోకి అనుమతించడు. దీంతో కోపోద్రిక్తుడైన శివుడు తన కొడుకు తల నరికేస్తాడు. గణేశుడు తన కొడుకు అని శివునికి తెలియదు. ఆ తరువాత శివుడు ఏనుగు తలను తెచ్చి, ఆ బాలుడి మొండానికి అతికించి, మరోసారి ప్రాణం పోస్తాడు. దీంతో ఇక్కడి ఆలయాన్ని ముండ్కతీయగా పిలుస్తుంటారు.

ఈ ఆలయానికి వెళ్లాలంటే సోన్‌ప్రయాగ్ నుంచి కాలినడకన వెళ్లాలి. 

ఈ ఆలయం త్రియుగి నారాయణ్ ఆలయానికి చాలా సమీపంలో ఉంది.

No comments