ఇరుముడి అంటే ఏంటి



అయ్యప్ప దీక్ష చేపట్టి శబరిమల బయలుదేరే స్వాములంతా ఇరుముడితో బయలుదేరుతారు. తలపై ఇరుముడితో 18 మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకుంటారు..ఇంతకీ ఇరుముడి అంటే ఏంటి


కార్తిక మాసం మొదలు మకర సంక్రాంతి వరకు అయ్యప్పదీక్షల కోలాహలం కనిపిస్తుంది. దీక్ష ముగింపు సమయంలో ఇరుముడి కట్టుకుని అయ్యప్పను దర్శించుకుని వచ్చాక దీక్ష విరిమిస్తారు


అయ్యప్ప దీక్ష ధరించిన వాళ్లు నల్లని దుస్తులు ధరిస్తారు. అన్నిటినీ స్వీకరించే గుణం నలుపు రంగుకు ఉంటుంది. నలుపు తమో గుణానికి ప్రతీక. తనలోని తమో గుణాన్ని అదుపులోకి తీసుకురాగలిగిన దీక్షధారుడి హృదయం పరమాత్మలో విలీనం అవుతుంది. అయ్యప్ప పూజలో ప్రధానాంశం ‘శరణుఘోష’. నవవిధ భక్తి మార్గాల్లో శరణాగతి సత్వర ఫలితాన్నిస్తుందని చెబుతారు.


 ఇరుముడి అంటే రెండు ముడులు కలది అని అర్థం. ఆ రెండూ భక్తి, శ్రద్ధకు ప్రతీక. ఇరుముడికి కట్టే తాడు ప్రణవం. భక్తి, శ్రద్ధలను సాధనతో పొందగలిగితే.. స్వామి అనుగ్రహం లభిస్తుందని అందులో ఆంతర్యం. ఇరుముడి ఒక భాగంలో దేవుడికి సంబంధించిన సామగ్రి ఉంచుతారు. రెండో భాగంలో నీళ్లు తొలగించిన కొబ్బరికాయలో ఆవునెయ్యిని నింపి ఉంచుతారు. జీవాత్మ, పరమాత్మలను అనుసంధానం చేయడం ఇందులోని ఆంతర్యం. ఈ నేతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇరుముడితో శబరిమల ఆలయంలోని పద్దెనిమిది మెట్లు ఎక్కి అయ్యప్పస్వామిని దర్శించుకుంటారు.


18 మెట్లపై ఏం వదిలేయాలంటే 

ఒక్కో సంవత్సరం ఒక్కో మెట్టుమీద ఒక్కో మాయాపాయాన్ని వదిలేయాలని గురుస్వాములు చెబుతారు.  

మొదటి 5 మెట్లు పంచేంద్రియాలకు సూచన. మనుషుల చూపు ఎప్పుడు మంచివాటిపైనే ఉండాలని సూచిస్తుంది. మంచి వినాలి, మంచి మాట్లాడాలి, తాజా శ్వాస పీల్చుకోవాలి

తర్వాతి  8 మెట్లు అష్టరాగాలకు సంకేతం. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మధం, మాస్తర్యం, అసూయ, దర్పాన్ని  విడిచిపెట్టి మంచి మార్గంలో వెళ్లాలని సూచిస్తాయి.

ఆ తర్వాత 3 మెట్లు సత్వం, తామసం, రాజసానికి సూచన

చివరి రెండు మెట్లు విద్య- అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. అంతా జ్ఞానం పొందేందుకు అవిద్య అనే అహంకారాన్ని వదిలిపెట్టాలని సంకేతం.


దీక్ష విరమించిన వెంటనే మళ్లీ పాత అలవాట్లకు లోబడితే ఆ దీక్ష ధారణకు అర్థం -సార్థకం లేనట్టే. మాల విరమించినా నిమమాలు లేకున్నా..వ్యక్తిత్వంలో, ప్రవర్తనలో వచ్చిన మార్పులు కొనసాగించినప్పుడే మండల దీక్ష చేపట్టినందుకు సార్థకత.

Comments

Popular posts from this blog

Sabarimala Temple Calendar 2024 : Opening & Closing Dates in 2024

Sri Azhagiya Singar Perumal Temple Timings – Kanchipuram

Sri Kalabhairava Temple Brahmotsavam 2024 Dates - Isannapalli, Kamareddy

Thiruvannamalai Karthigai Deepam Festival - 2024 Dates

Sri Polamamba Ammavaru Jatara Dates 2023-24 Dates - Sambara

Sri Lakshmi Narsimha Swamy Brahmotsavam 2024 - Ahobilam

Sri Murugan Temple - Thiruparankundram

Sri Anchumoorthi Temple – Thirumittakode