సుబ్రమణ్య షష్ఠి




  • సుబ్రహ్మణ్యుడు అంటే గొప్ప తేజస్సు కలవాడు అని అర్ధం. ఆ సుబ్రమణ్య స్వామిని ఆరాధించే తిధి సుబ్రమణ్య షష్ఠి. 
  • కుమారస్వామి జననం కార్తీకమాసంలో జరిగింది, ఆ మాసంలో స్కంద పంచమి, స్కంద షష్ఠి అనే పర్వాలు జరుపుకుంటారు.
  • దేవా సర్వసైనాదక్షుడిగా అయన అసుర సంహారం చేసింది మార్గశిర శుద్ధ షష్ఠి. దీనినే సుబ్రమణ్యషష్ఠిగా జరుపుకుంటారు.
  • సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. నదీస్నానం ఆచరించాలి (సమీపాన నది ఉంటే) లేదా  శిరఃస్నానం చేయాలి. 
  • సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలు లేదా పాలు నైవేద్యంగా సమర్పించాలి. 
  • సుబ్రహ్మణ్య స్వామి విజయ గాథలు చదవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కీర్తనలు ఆలాపించాలి. దగ్గరలోని స్వామి ఆలయాలను సందర్శించి పూజలు చేయాలి. 
  • వీలైనంత దానధర్మాలు చేయాలి. రోజంతా ఉపవాస దీక్ష ఆచరించాలి.
  • స్కంద షష్టి నాడు సుబ్రహ్మణ్య దేవాలయాలలో ‘శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి‘ కళ్యాణం నిర్వహిస్తుండడం పరిపాటి. 
  • ఈ వివాహాన్ని వీక్షిస్తే అవివాహిత యువతీ యువకులకు ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయని, సత్సంతానం కలుగుతుందని పెద్దల మాట.  
  • విశేషించి ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా, కావడి సమర్పించినా సత్సంతానప్రాప్తి, వారి కుటుంబంలోనూ, రాబోయో తరాలవారికి కూడా వంశవృద్ధి జరుగుతుందని విశ్వాసం. 
  • అందుకే సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలను ఎక్కువగా సందర్శిస్తుంటారు. స్కంద షష్ఠినాడు సుబ్రహ్మణ్య కళ్యాణం జరిపించే భక్తులకు సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. 
  • సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి దేశం నలుమూలలా దేవాలయాలున్నాయి.



సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు తెల్లవారే లేచి శిరస్నానమారించి పాలు, పంచదారలతో నిండిన కావడులను ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు. దేవాలయాలను దర్శించి భక్తిశ్రద్ధలతో అష్టోత్తర శతనామ పూజలు చేస్తారు. భక్తులు కావడులతో తెచ్చిన పంచదార, పాలను స్వామికి సమర్పించుకుంటారు. అయితే ఈ కావడిలోని వస్తువులు భక్తుల మొక్కులను బట్టి ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆచారం తమిళనాడు రాష్ట్రంలో విశేషంగా ఆచరణలో ఉంది.

2022 : నవంబర్  28.

Comments

Popular posts from this blog

Sri Venkateswara Swamy Temple - Vyalikaval, Bangalore

Tirumala Tirupati Brahmotsavam Dates 2025

Sabarimala Temple Calendar 2025 : Opening and Closing Dates in 2025

Sri Raghavendra Swami Aradhana 2024 Dates

Sri Chittaramma Jatara Dates 2025 - Gajularamam

Sri Prasanna Venkateswara Swamy Brahmotsavam 2024-25 Dates – Balabhadrapuram

Tirumala: March 2025 Quota Details

Paush Month 2024-25 Dates