బ్రహ్మంగారి కాలజ్ఞానం - 1
బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి , భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే చెప్పినారు వాటిని కాలజ్ఞానంగా చెబుతారు.
విజయ నగరం పూజలు అందుకొని కొన్ని రోజులు చెడిపోతుంది.
కురుక్షేత్రంలో జనులు మూకలు ముకలుగా నరుకొని చనిపోతారు
శ్రీ కాళహస్తీశ్వరుని ద్వారపాలకులు గ్రుద్దులాడు కొంటారు.
మంగళగిరిలో వైష్ణవులు కలహముచే యుద్దానికి సిద్ధపడుతారు
పగలు చుక్కలు పది కొన్ని గ్రామాల జనులు నశిస్తారు.
కార్తీక బహుళ ద్వాదశినాడు ఉత్తరదిక్కున వింతైన చుక్కలు పుట్టి అయిదు నెలలు ప్రకాశిస్తాయి.
తిరుపతి మార్గము కట్టబడుతుంది.
దుష్ట గ్రహాలు విజృంభిస్తాయి, ప్రజలు హాహాకారాలు చేస్తారు.
జాము జాముకు నక్కలరచి కొందరికి నష్టం కలుగుతుంది.
5000 సంవత్సరములు కలియుగం గడిచిన తరువాత కాశీలో గంగ కనపడదు.
బెంగళూరులో కామాక్షి రక్తం కక్కుతుంది.
కారెంపూడి కలహాలవల్ల రాజులు నశిస్తారు.
రక్తపు వాన కురుస్తుంది
రాతి గుంటలలో రక్తం - చీము కారుతుంది.
ఆకాశంలో పొగలు మంటలు పుడుతాయి.
ఒకరి ఇల్లాలు ఇంకొకరి పాలవుతుంది.
పుణ్య స్థలాలు, దేవాలయాలు పాడుపడిపోతాయి.
వేంకటేశ్వరుని సొమ్ము దొంగలించబడుతుంది.
పుణ్యస్థలాలలో ఆరుగురు దుష్టులు ఆవిర్భిస్తారు.
కృష్ణ మధ్య బంగారం రధం కనిపిస్తుంది. దానిని చూసిన వారు గుడ్డి వారవుతారు
శ్రీశైల భ్రమరాంబ ఆలయంలో రెండు తలల బంగారు ముసలి కనబడి ఆమెలో లీనమౌతుంది.
హరిహరులు ఆలయంలో రక్తం పుడుతుంది.
Comments
Post a Comment