చైత్ర మాసం 2022
- చాంద్రమానంలో మొదటి నెలైన ఈ మాసానికి చైత్ర మాసం, మధుమాసం, వసంత మాసం అనే పేర్లు ఉన్నాయి.
- ఋతువులలో మొదటిదైన వసంత ఋతువు ఈ మాసంతో ప్రారంభం అవుతుంది.
- ఈ మాసం ప్రకృతి మార్పులకు కూడా నాందిగా నిలుస్తోంది.
- శిశిర ఋతువులో ఆకులూ రాల్చే చెట్లు అన్ని చైత్రంలో చిగురిస్తాయి.
- ఈ మాసంలో ప్రకృతి అంతా ఒక నూతన శోభను సంతరించుకుంటుంది.
- అందుకే ఈ మాసాన్ని నవ చైతన్యానికి ప్రతీకగా చెబుతారు.
- ఈ మాసంలో వసంతానవరాత్రులు, శ్రీరామనవమి నవరాత్రులను ఆచరిస్తారు.
- సూర్యుడు కుంభరాశి నుండి మీనరాశి లోకి ప్రవేశిస్తాడు. దీనిని మీనసంక్రమణం అన్ని అంటారు.
- ఈ సంక్రమణం తరువాత ఉండే పదహారు ఘడియల కాలం ఎంతో పుణ్యకాలంగా చెప్పబడింది.
- ఈ నెల మొదటి రోజు నుండి మూడు, నాలుగు నెలలపాటు చలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీటిని వితరణ చేయడం ఒక సంప్రదాయంగా వస్తుంది.
2022 : ఏప్రిల్ 02 నుండి ఏప్రిల్ 30 వరకు.
Comments
Post a Comment