వసంత నవరాత్రుల ప్రాముఖ్యత
- చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి చైత్ర శుద్ధ నవమి వరకు ఉన్న తొమ్మిది రోజులను వసంత నవరాత్రి అని అంటారు.
- శరదృతువులో ఆశ్వీయుజ మసంలో వచ్చే శరన్నవరాత్రులకు (దేవీ నవరాత్రులకు) ఎంతటి ప్రాశస్త్యం ఉందో, వసంత నవరాత్రులకూ అంతే ఆధ్యాత్మిక విశేషం ఉంది.
- వైష్ణవ క్షేత్రాలన్నీ వసంత నవరాత్రుల సంబరంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతాయి. రాముడు జన్మించిన తిథి చైత్ర శుద్ధ నవమి.
- రాముని జన్మోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణోత్సవం జరుపుకుంటాం. పాడ్యమి మొదలు రామకల్యాణం జరిగే నవమి వరకూ నవరాత్రులు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.
- నవరాత్రుల్లో రామాయణం పారాయణం చేస్తారు.
- రామాయణం ప్రకారం.. రాముడు-ఆంజనేయుడు తొలిసారి కలుసుకుంది వసంత రుతువులోనే.
- సుగ్రీవునితో రాముడి మైత్రి చిగురించిందీ వసంత రుతువులోనే.
- నవరాత్రుల్లో రామాయణ పారాయణం, సుందరకాండ పారాయణం చేయడం మంచిది.
- రామాలయాల్లో భక్తుల భజనలు, సంకీర్తనలతో, రామనామం మార్మోగుతుంటుంది.
2022 తేదీలు : ఏప్రిల్ 02 నుండి ఏప్రిల్ 10 వరకు.
Comments
Post a Comment