చాతుర్మాస దీక్ష 2022 తేదీలు
- ఆషాఢమాసానికి సంబందించిన అంశాలలో చాతుర్మాస్య వ్రతం ఎంతో ముఖ్యమైనది.
- చాతుర్మాసం అంటే నాలుగు నెలలు అని అర్ధం
- తొలి ఏకాదశిగా పిలవబడే ఆషాడ శుద్ధ ఏకాదశి నుండి చాతుర్మాస వ్రతం ఆరంభమవుతుంది.
- ఆషాడ శుద్ధ ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువు పాలసముద్రంలో యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. ఈ విధంగా శయనించిన విష్ణువు నాలుగు నెలలు తరువాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు యోగనిద్ర నుండి మేల్కొంటాడు.
- ఆషాడ శుద్ధ ఏకాదశి రోజు మొదలైన చాతుర్మాస వ్రతం కార్తీక శుద్ధ ద్వాదశి రోజు ముగుస్తుంది.
- విష్ణువు శయనించిన నాలుగు నెలలు చాతుర్మాస్యం ఆచరించబడుతుంది.
- భగవంతుని మీద మనసును లగ్నం చేయడమే ఈ వ్రతం ముఖ్య ఉద్దేశం.
- స్కాందపురాణం, భవిష్యపురాణం, బ్రహ్మవైవర్త పురాణం ఈ వ్రత విధానాన్ని పేర్కొంటున్నాయి. వరాహపురాణంలో ఈ వ్రత ప్రాశస్త్యం వివరించబడింది.
- సన్యాసులు,యతులు ఒక చోటనే వుంటూ దీక్షతో అనుష్ఠాలను కొనసాగిస్తారు.
- గృహస్తులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.
ఈ నాలుగు నెలలు దేశం లో సుభిక్షముగా వానలు కురుస్తాయి.నేల బురద మయమవుతుంది . ఇలాంటి తేమ వాతావరణం వ్యాధులను కలిగించే సూక్ష్మ క్రిముల వ్యాప్తికి అనువుగా ఉంటుంది . చాతుర్మాస్య వ్రతములో పాటించే ఆహార, విహారాది నియమాల ద్వారా రోగాల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు.
ముఖ్యమైన పండుగలు
గురు పూర్ణిమ
శ్రీ కృష్ణ జన్మాష్టమి
రక్షా బంధం
వినాయక చవితి
దసరా
దీపావళి
చాతుర్మాసం లో మొదటి నెల శ్రావణ మాసం . ఈ మాసం శివునికి అత్యంత ప్రీతీకరమైన మాసం.శ్రావణ సోమవారం వ్రతాలూ చేస్తారు, సోమవారాలు ఏదైనా కొత్త పని ప్రారంభిస్తారు, ఉపవాసాలు వుంటారు.శ్రావణ మాసం లో ప్రతి రోజు పవిత్రమైనది. ఆకు కూరలు తినడం మానివేస్తారు, కొంతమంది కాయకూరలు కూడా తినరు.
రెండవ నెల భాద్రపద మాసం. శ్రీ కృష్ణాష్టమి, వినాయక చవితి పండుగలు ఈ నెలలో అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఈ నెలలో పెరుగు తినడం మానివేస్తారు.
నవరాత్రులలో ఆశ్వయుజ మాసం మొదలు అవుతుంది . దసరా , దీపావళి పండుగలు వస్తాయి, ఆశ్వయుజ మాసం లో పాలను, కార్తీక మాసం లో పప్పు పదార్థాలను తినడం మానివేస్తారు.
ఈ వ్రతంలో పచ్చళ్లు, ఊరగాయలు, బెల్లము, చింతపండు, వంకాయ, గుమ్మడి , ముల్లంగి, పొట్లకాయ, పుచ్చకాయ, కొత్తఉసిరి, ఉలవలు కూడా నిషేదిస్తారు.
మాంసాహారం తినడం మానివేస్తారు.
కొంత మంది పురాణాలు చదువుతారు
ప్రతి రోజు గుడికి వెళ్లి దైవ దర్శనం చేసుకుంటారు.
రామాయణ, భగవద్గిత, భాగవతం ప్రతి రోజు పారాయణ చేస్తారు.
కటిక నేల మీద నిద్రిస్తారు.
బ్రహ్మచర్యం పాటిస్తారు
ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంవత్సరంలో చేసిన పాపాలు నశిస్తాయి అని మహాభారతం చెబుతోంది.
సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాలు చేయలేనివారు ఈ చాతుర్మాస్యంలో వచ్చే ఎనిమిది ఏకాదశి వ్రతాలు చేసిన విశేష ఫలితం ఉంటుంది.
చాతుర్మాస దీక్ష ఎలా చేయాలి ?
సూర్యోదయం కంటే ముందు నిద్ర లేచి అన్ని కార్యక్రమములు ముగించుకొని, విష్ణు భగవానుని పూజించాలి
కటిక నెల మీద నిద్రించాలి
మౌనవ్రతం పాటించాలి, దీని వల్ల ఒకరి తో కలహాలు రాకుండా ఉంటాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ఎపుడు విష్ణు నామం స్మరిస్తూ ఉండాలి.
చాతుర్మాసం ఆఖరి రోజు బ్రాహ్మణుడికి భోజనం పెట్టి, బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి.
ఈ మాసం లో చేసే దానాలు మరియు జపాలు 1000 రేట్లు ఫలితం అధికంగా ఉంటుంది అని భావిస్తారు. సన్యాసులు గ్రామా సరిహద్దులు దాటకుండా ఈ నాలుగు నెలలు ఒక చోటే స్థిరంగా వుంటారు.
2022 లో జులై 10 నుంచి నవంబర్ 05 వరకు చాతుర్మాసం ఉంటుంది.
Comments
Post a Comment