ఆషాడ మాసంలో విశేష తిధులు
చాంద్రమానంలో నాల్గవ మాసం ఆషాడ మాసం.ఈ మాసంలోని పౌర్ణమి నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రంలో కాని లేదా ఉత్తరాషాఢ నక్షత్రంలో కాని కలిసివుండటం చేత ఈ మాసం ఆషాఢంగా పేరుపొందింది.
ఈ మాసంలో ముఖ్యమైన తిధులు :
ఆషాఢ శుద్ధ పంచమి : దీనిని స్కంద పంచమిగా వ్యవహరిస్తారు. ఈరోజు ఉపవాసము ఉంది సుబ్రమణ్య స్వామిని పూజించాలి. షప్టితో కూడిన పంచమి ప్రశస్తమని భవిష్యోత్తర పురాణం చెబుతోంది. ఈ పూజ వల్ల సంతానం కలుగుతుంది.
ఆషాఢ శుద్ధ షష్టి : ఈ రోజు కుమార షష్టి.పంచమితో పాటు ఈ రోజు కూడా కుమారస్వామిని అర్చించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి అని వరాహ పురాణం చెబుతోంది.
ఆషాఢ శుద్ధ సప్తమి : ఈ రోజు సూర్యభగవానుడిని పూజించాలి. సూర్యుని పూజించాలి వల్ల అనంతమైన పుణ్యఫలాన్నిస్తాయి.
ఆషాఢ శుద్ధ అష్టమి : ఈ రోజున దుర్గానామాలతో మహిషాసురమర్దినిని అర్చించాలి. దీని వల్ల శత్రుబాధ తొలగి సమస్త సుఖాలు లభిస్తాయి.
ఆషాఢ శుద్ధ నవమి : ఈ రోజు ఐరావత గజంపై వుండే దుర్గాదేవిని ఉపవాసంతో ఆరాదించాలి.ఇలా చేస్తే ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుందని భవిష్యోత్తర పురాణం తెలియచేస్తుంది.
ఆషాఢ శుద్ధ దశమి : ఈ రోజు శాకవ్రతం చేసి శ్రీమహాలక్ష్మిని అర్చిస్తే సర్వసంపదలు అభివృద్ధి చెందుతాయి.
శుద్ధ ఏకాదశి : ఈ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. ఈ రోజు శ్రీమహావిష్ణువు నిద్రకు ఉపక్రమిస్తాడు. ఈ రోజు గోపద్మవ్రతం చేస్తే పుత్రపౌత్రాభివృది, ధానాధ్యానవృది కలుగుతుంది.
శుద్ధ ద్వాదశి : దీనిని వాసుదేవద్వాదశి అని అంటారు. శయన ఏకాదశినాడు ఉపవాసముండి, శ్రీ మహావిష్ణువుని అర్చించాలి. దానధర్మాలు చేస్తే సమస్త శుభాలు కలుగుతాయి. చాతుర్మాస్య వ్రతాన్ని ద్వాదశినాడే ప్రారంభించాలి.
శుద్ధ చతుర్దశి : ఈ రోజు శివుణ్ణి పూజిస్తే శివలోక ప్రాప్తి.
ఆషాఢ పూర్ణిమ : ఈ రోజు వ్యాస భగవానుని పూజిస్తారు. ఈ రోజు సంధ్యాకాలంలో కోకిలా వ్రతం చేయాలి. ఈ రోజు శివశయన వ్రతానికూడా ఆచరిస్తారు. ఈరోజు గురు సేవనం, అన్నదానం చేస్తే అక్షయ ఫలం పొందుతారు.
కృష్ణ పక్ష విదియ : ఈ రోజు చాతుర్మాస్య దీక్షకు శుభమైన రోజు.
Comments
Post a Comment