గణపతి విగ్రహ ఏర్పాటుకు నియమాలు
గణపతి ఆరాధనకు, భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి అత్యంత పవిత్రమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. వినాయక చవితి రోజున గణేశుడు ప్రసన్నుడవుతాడు.
నియమాలు
విగ్రహం విరిగిపోకుండా సంపూర్ణంగా ఉండేలా చూసుకోవాలి. గణపతి విగ్రహంలో ఎలుక, ఒక దంతం, అంకుశం, మోదక ప్రసాదం ఉండాలి.
సనాతన సంప్రదాయంలో ఎడమ వైపు నుంచి కుడి వైపునకు తిరిగి ఉన్న తొండం ఉన్న గణపతి విగ్రహానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది.
ఎడమ వైపున తొండం ఉన్న వినాయక విగ్రహాన్ని పూజిస్తే, సంపద, వృత్తి, వ్యాపారం, సంతానం , వైవాహిక ఆనందం మొదలైన వాటికి సంబంధించిన అన్ని కోరికలు తీరతాయని విశ్వాసం.
కుడివైపు తొండం ఉన్న గణపతిని సిద్ధివినాయకుడు అంటారు. సాధకుడు ఎవారైనా ఇలాంటి గణపతిని పూజిస్తే శత్రువులపై విజయం సాధిస్తాడని, అతని జీవితానికి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం.
గణపతి విగ్రహాన్ని ఉంచేటప్పుడు, దిశపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈశాన్యంలో శుభ్రమైన ప్రదేశంలో గణపతిని ప్రతిష్టించాలి.
Comments
Post a Comment