Maha Shivaratri: మహా శివరాత్రి రోజున ఉపవాస సమయంలో ఏమి తినాలి, ఏమి తినకూడదు
శివరాత్రి రోజున జాగారానికి, ఉపవాసానికి విశిష్టమైన స్థానం ఉంది. మహా శివరాత్రి పండుగ రోజున చాలా మంది ‘నిర్జల వ్రతాన్ని’ ఆచరిస్తారు. అంటే కొందరు భక్తులు నీరు మాత్రమే తాగుతారు. మరికొందరు పండ్లు, పాలు, తృణధాన్యాలు తిని ఉపవాసం ఉంటారు. మహా శివరాత్రి ఉపవాసం.. శివ రాత్రి రోజు ఉదయం ప్రారంభమై మరుసటి రోజు ఉదయం ముగుస్తుంది. ఉపవాస నియమాలు అన్ని శివరాత్రిలకు ఒకే విధంగా ఉంటాయి.
మహా శివరాత్రి జాగరణ-ఉపవాసం నియమాలు
- మహాశివరాత్రి జాగరణ, ఉపవాసం చేయాలి అనుకుంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. సూర్యోదయం తర్వాత నిద్రలేచిన వారు చేసే జాగరణ ఫలితాన్నివ్వదు
- వేకువజామునే స్నానమాచరించి భక్తిశ్రద్ధలతో భోళాశంకరుడిని పూజించాలి
- పూజ సమయంలో శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి.
- జాగరణ అంటే భౌతికంగా మేల్కొని ఉండాలన్న ఆలోచనతో ఏదో టైమ్ పాస్ చేయడం కాదు... రోజంతా పంచాక్షరి నామస్మరణలో, శివయ్య నామస్మరణలో గడపాలి
- శివరాత్రి రోజున శివ లింగం దగ్గర నేతి దీపం వెలిగించడం శుభప్రదం
- శివరాత్రి ఉపవాసం ఫలితం సంపూర్ణంగా దక్కాలంటే మర్నాడు చతుర్థశి తిథి ముగిసేలోగా ఉపవాసం విరమించాలి
- అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఒక్కపూట భోజనం చేసి శివనామస్మరణలో గడిపినా మంచిదే
- శివరాత్రి ఉపవాసం ఉండేవారు పాలు, పండ్లు లాంటి సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి
మహాశివరాత్రి రోజు చేయకూడని పనులు
- మహాశివరాత్రి రోజు ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం తీసుకోరాదు
- శివారాధన చేసేవారు పొగాకు, మద్యానికి ఈరోజు దూరంగా ఉండాలి
- శివారాధనకు పొరపాటున కూడా తులసిని ఉపయోగించకూడదు
- శివుడికి సమర్పించే బిల్వ పత్రాలు, శమీ పత్రాల తొడిమె మొదటి భాగాన్ని తీయకుండా సమర్పించరాదు
- ప్యాకెట్ పాలతో అభిషేకం చేయరాదు..ఆవుపాలతో చేయాలి
- పూజ మధ్యలో లేవకూడదు
- పూజ, ఆరాధన మధ్యలో మాట్లాడటం - ఆవేశానికి లోనవడం అస్సలు చేయరాదు
- జాగరణ చేసేవారు రాత్రంతా నడుం వాల్చడం కూడా సరికాదంటారు పండితులు
- శివరాత్రి రోజు నల్లని దుస్తులు అస్సలు ధరించకూడదు
Comments
Post a Comment