Tirumala: Annamayya Vardhanti Utsavas from April 04 – 08
TTD is grandly organizing the 521st Vardhanti of Sri Tallapaka Annamacharya from April4-8 at Dhyan mandir and the 108 feet Annamaiah statue at Tallapaka in Kadapa district Narayanagiri gardens in Tirumala and Annamacharya Kala Mandir at Tirupati.
The
festivities will begin at Padala Mandapam in Alipiri, Tirupati at 6.00 am on
April 4, and a vibrating Saptagiri sankeertan Gosti Ganam at Narayanagiri
Gardens on the same day evening.
For
four days from April 5-8, TTD will conduct religious and Bhakti sangeet
programs at Annamacharya Kala Mandir at Tirupati. Elides at Dhyan mandir
and 108 feet Annamacharya statue at Tallapaka.
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 521వ వర్థంతి ఉత్సవాలు ఏప్రిల్ 4 నుండి 8వ తేదీ వరకు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 6 గంటలకు తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం వైభవంగా జరుగనుంది. ఏప్రిల్ 5న తిరుమలలో సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహిస్తారు.
ఏప్రిల్ 5 నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం వేళ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Comments
Post a Comment