శ్రావణ మాసం


  • చాంద్రమానం ప్రకారం ఐదవ మాసం శ్రావణం.
  • ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రానికి చేరువలో ఉండటం చేత ఈ మాసానికి శ్రావణమాసమనే పేరు వచ్చింది.
  • వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం కూడా శ్రావణ నక్షత్రమే.
  • ముఖ్యంగా ఈ మాసం శుభకార్యాలు అనువైనది.అందుకే ఈ మాసానికి శుభమాసం అని పేరు.
  • ఈ నెలలో నోములు,వ్రతాలు, పండుగలతో ప్రతి ఇల్లు కళకళలాడుతుంది.
  • వర్ష ఋతువు ఈ మాసంతో ప్రారంభమవుతుంది.వ్యవసాయపరంగాను ఈ మాసం ప్రాముఖ్యాన్ని పొందింది.
  • ఈ మాసంలో గృహనిర్మాణ ఆరంభించడం వల్ల సకలశుభాలు కలుగుతాయి అని మత్య్స పురాణం చెబుతోంది.
  • శ్రీకృష్ణ భగవానుడు ఈ మాసంలోనే జన్మించాడు. హయగ్రీవుని జయంతి కూడా ఈ నెలలోనే వస్తుంది.
  • తల్లి దాస్యాన్ని విడిపించేందుకు గరుడుడు అమృత బాండాన్ని సాధించింది ఈ మాసంలోనే.
  • ఈ నెలలో చేసే సాధనలు అంటే జప పారాయణల లాంటివి గొప్ప ఫలితాన్నిస్తాయి.
  • ఈ మాసంలో ఏక భుక్తం (పగలు భుజించి రాత్రి ఉపవాసం ఉండటం ) నక్తం (పగలు ఉపసం ఉంది రాత్రి భుజించడం ) పాటించడం వల్ల విశేషమైన ఫలం లభిస్తుంది.
  • శ్రావణమాసంలో పగలు నిద్రించరాదు అని శాస్త్రం.
  • శ్రావణంలో శివుణ్ణి, విష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి అని శాస్త్ర వచనం.
  • ఈ మాసంలో శివునకు, విష్ణువుకు అభిషేకం చేయడం వల్ల అరిష్టాలు తొలగిపోతాయి.

Comments

Popular posts from this blog

Sri Venkateswara Swamy Temple - Vyalikaval, Bangalore

Sabarimala Temple Calendar 2025 : Opening and Closing Dates in 2025

Sri Prasanna Venkateswara Swamy Brahmotsavam 2024-25 Dates – Balabhadrapuram

Sri Raghavendra Swami Aradhana 2024 Dates

Tirumala Tirupati Brahmotsavam Dates 2025

Sri Lakshmi Narasimha Swamy Divya Tiru Kalyana Mahotsavams 2025 Dates – Antarvedi

Sri Penusila Lakshmi Narasimha Swamy Temple - Penchalakona

Sri Kabbalamma Temple Timings - Kabbalu

Sri Lakshmi Narasimha Swamy Brahmotsavams 2024 - Kadiri