ఉప్పిలి అప్పన్ ఆలయం - తంజావూర్
ఈ ఆలయం తమిళనాడులోని తంజావూర్ దగ్గరలో ఉంది.
స్థల పురాణం విషయానికి వస్తే మార్కండేయుడు లోక సంచారం చేస్తూ తిరువ్విన్నగరంకి వచ్చినపుడు తన కోరిక తీరటానికి ఈ ప్రాంతమే సరి అయినదని అనుకుని వేల సంవత్సరాలు లక్ష్మి దేవి కోసం తపస్సు చేయటం మొదలుపెట్టాడట. ఎన్నో ఏళ్ళు గడచిన తర్వాత లక్ష్మి దేవి ఒక చిన్న పిల్ల రూపంలో ఆయన ముందుకు వచ్చింది.
ఆ పాపను చూసిన మార్కండేయుడికి తన తపస్సు సగం ఫలించిందని అనిపించిది. ఆ పాపను ఎంతో ప్రేమతో పెంచి పెద్దవాడిని చేయసాగాడు. అలా ఉన్న రోజుల్లో శ్రావణ మాసంలో విష్ణుమూర్తి ఒక ముసలివాడి రూపంలో మార్కేందేయుడి ముందుకు వచ్చి ఆ అమ్మాయిని తనకు ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు.
అందుకు మార్కేందేయుడు నువ్వు చూస్తే ముసలివాడివి, నా కూతురు చూస్తే చిన్నపిల్ల కనీసం వంటలో ఉప్పు సరిగా వేసిందో లేదో కూడా తెలియని అమాయకురాలు, అలాంటి పిల్లని నీకిచ్చి ఎలా పెళ్లి చేయగలను అని ప్రశ్నిస్తాడు. దానికి సమాదానంగా ముసలి వాడు ఉప్పు లేకపోయినా తను చేసిన వంటకి వంకలు పెట్టకుండా నేను తింటాను, అంతేకాని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా అక్కడ నుంచి కదలను అని మొండిపట్టు పడతాడు.
ఇదంతా చూసిన మార్కండేయుడికి అనుమానం వచ్చి కళ్ళు మూసుకుని తన దివ్య నేత్రాలతో వచ్చినది విష్ణుమూర్తే అని తెలుసుకుంటాడు. అతను కళ్ళు తెరిచి చూసేసరికి కళ్ళముందు శంఖ, చక్ర, గధారూరుడైన విష్ణుమూర్తి దర్శనమిస్తాడు . అప్పుడు మార్కండేయుడు తన కూతురిని విష్ణువుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు.
ఈ పురాణగాధ ప్రకారం ఇప్పటికి కూడా ప్రతి రోజు ఉప్పు వెయ్యకుండానే దేవుడికి నైవేద్యం పడతారు. ఇక్కడ ఫాల్గుణ మాసంలో జరిగే రథోత్సవం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ రథోత్సవంలో ఉప్పిలి అప్పన్ గా పిలువబడే విష్ణుమూర్తి, భూదేవితో కలిసి తిరువీధిలో ఊరేగుతాడు.
ఈ ఒక్క ఉత్సవమే కాక వసంతోత్సవాలు, కళ్యాణోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. శ్రీరామనవమి పది రోజుల పాటు ఘనంగా నిర్వహించి ఆఖరి రోజు కనకాభిషేకం, శ్రీరామ పట్టాభిషేకంతో ముగిస్తారు.
ఈ విధంగా విష్ణు మూర్తి లక్ష్మి దేవులు ఒక అవతారం ఎత్తి భూలోకంలో పెళ్లి చేసుకుని భక్తులని ఉద్దరిస్తున్నారు.
Comments
Post a Comment