కార్తీక మాసం విశిష్టత
- చాంద్రమానంలో ఎనిమిదవ నెలైన కార్తికమాసం ఆధ్యాత్మికంగా ఎంతో విశేషమైంది.
- ఈ నెలలోని పౌర్ణమినాడు చంద్రుడు కృత్తికా నక్షత్రానికి దగ్గరగా వుండటంచేత ఈ నెల కార్తికంగా పేరొందింది.
- శరదృతువులో రెండవ నెలైన ఈ కార్తీకానికి కౌముది మాసం అని పేరు కూడా వుంది. కౌముది అంటే వెన్నెల అని అర్థం.
- కార్తీకంతో సమానమైన మాసం లేదని స్కాందపురాణం చెబుతోంది.
- కార్తికమాసం శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతికరమైంది. అందుకే శివారాధనకు, విష్ణుఆరాధనకు ఈ మాసం ఎంతో ప్రసిద్ధం.
- కార్తిక మాసంలో శివారాధన చెప్పలేనంత ఫలితాన్నిస్తుంది.
- ఈ నెలలో నక్త వ్రతాన్ని అంటే పగలు ఉపవసించి, రాత్రి భుజించడం చేస్తూ, రోజూ ప్రదోషంలో (సాయం సంధ్యాసమయంలో) శివుని ఆరాధించడం వలన శివానుగ్రహం లభించడంతో పాటు సర్వదేవతలను పూజించినంత ఫలితం లభిస్తుందని పలు పురాణాలు చెబుతున్నాయి.
- ఈ నెలలో పరమేశుని మారేడు దళాలతో అర్చించడంతోపాటు తుమ్మిపూలతో పూజించడం విశేష ఫలదాయకం.
- కార్తికమానంలో నిత్యం విష్ణుదేవుడిని తులసీ దళాలతో అర్చించడం విశేష ఫలదాయకం, ఇంకా ఈ నెలలో విధిగా అవిసె పూలతో విష్ణువును పూజించాలని చెప్పబడింది.
- కార్తిక మాసంలో గృహనిర్మాణాన్ని ఆరంభించడం మంచిదంటారు.
- ఈ మాసంలో ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టడం వలన ధనధాన్య లాభం సిద్ధిస్తుందని మత్స్యపురాణం చెబుతోంది.
- కార్తికమాస విధుల్లో మరో ముఖ్యాంశం వన భోజనాలు. వనభోజనాలను పలు వృక్షజాతులున్న వనంలో ఉసిరిక చెట్టు క్రిందనే చేయాలని శాస్త్రం చెబుతోంది.
- వనభోజనాలను చేయడం వలన అశ్వమేధయాగం చేసినంత ఫలితం లభిస్తుంది.
- ఈ మాసంలో కార్తీక సోమవార వ్రతాలు ఆచరిస్తారు. ఈ మాసం లో శివుడికి చేసే అభిషేకం అనేక రేట్లు ఫలితం ఉంటుంది.
- ఈ మాసం అంత కార్తీక దీపాలు వెలిగిస్తారు.
- కార్తీక స్నానం మహాపుణ్యప్రదం. ప్రతిరోజూ కృత్తికా నక్షత్రం అస్తమించేలోగా తెల్లవారుజామునే స్నానం చేయాలి. అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది.
- ఈ మాసంలో పురాణ శ్రవణం, దానధర్మాచరణ వల్ల విశేష పుణ్యఫలం సిద్ధిస్తుంది.
- సోమవారానికి చంద్రుడు అధిపతి. ఆ రోజు ఉపవాసం చంద్రమౌళికి ప్రీతికరం. కార్తీక సోమవారం ఉపవాసం చేస్తూ, పంచామృత రుద్రాభిషేకం చేయడం వల్ల విశేష ఫలితం కలుగుతుంది.
- ఈ మాసంలో సాయం సమయాన శివాలయంలో భక్తితో గోపుర ద్వారం వద్ద, శిఖరం మీద, శివలింగం ముందు ఆవు నేతితో దీపారాధన చేసినవారు ధన్యులవుతారు.
- దీపదానం విశేష ఫలాన్నిస్తుంది.
- ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర కి ఉపక్రమించిన విష్ణు భగవానుడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర లేస్తాడు.
- కార్తీక మాసంలో కమలాక్షుడైన శ్రీహరిని కమలాలతో పూజించేవారింట కమలవాసిని అయిన శ్రీ మహాలక్ష్మి స్థిరంగా ఉంటుంది. శ్రీహరిని తులసీదళాలతో, జాజి పూలతో పూజించిన వారికి పునర్జన్మ ఉండదు.
- పురాణాల ప్రకారం మహాశివుడు త్రిపురాసుర అనే రాక్షసుడుని కార్తీక పౌర్ణమి రోజు వధించాడు.
- ఈ మాసంలో గంగా నది ప్రతి నదిలోకి ప్రవహిస్తుంది అని నమ్ముతారు.
- ఈ మాసం లో అయ్యప్ప భక్తులు మాలధారణ చేస్తారు, ఇది మకర సంక్రాంత్రి వరకు కొనసాగుతుంది.
- కేవలం శాకాహారమే తింటూ ఒక పూట భోజనం చేయాలి, దానధర్మాలు మంచి ఫలితం ఇస్తాయి.
- కృత్తికలో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కనుక ఇది శివ ప్రీతికరం. చన్నీటి స్నానం ఆచరించడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత క్రమబద్ధమై చక్కటి ఆకలి కలిగిస్తుంది.
కార్తీక మాసం లో నది స్నానం విశిష్టత
2022 తేదీలు : అక్టోబర్ 26 నుండి నవంబర్ 23 వరకు.
Comments
Post a Comment