Magha Masam: మాఘమాసంలో నదీ స్నానానికి, సూర్యుడు పూజకు గల ప్రాముఖ్యత
హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత ఉంది.
చంద్రుడు మఖ నక్షత్రంతో ఏర్పడే మాసం కనుక మాఘమాసం అయింది. అఘము అంటే పాపము అని అర్థము. మాఘము అంటే పాపాలను నశింపచేసేది అని అర్థము. పాపాలను నశింపచేసేటటువంటి శక్తి ఉన్నటువంటి మాసము కాబట్టే మాఘమాసమునకు ప్రత్యేకత ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ నెల శ్రీ మహా విష్ణువుకి అత్యంత ప్రీతికరమైంది.
ఈ నెలలో చేసే నదీస్నానం.. శ్రీమన్నారాయణుని పూజ ఇచ్చే దానం.. కోటి క్రతువుల ఫలితాలను ఇస్తుంది. మాఘమాసంలో ఏ నది నీరైనా గంగానదితో సమానం. ఈ మాసంలో నదీస్నానం సర్వపాపాలను హరిస్తుంది. ఈ మాసంలో తెల్లవారుఝామునే లేచి స్నానం ఆచరిస్తారు. ప్రత్యేక్ష భగవానుడైన సూర్య భగవానుడిని పూజిస్తారు.
నదిలో, లేదా బావుల వద్ద స్నానం చెయ్యడం వలన విశేష ఫలితం లభిస్తుంది. నదుల్లో స్నానం చేయడానికి వీలుకాని యెడల కనీసం ఇంట్లో స్నానం చేసి సమయంలోనైనా గంగ, గోదావరి, కావేరి వంటి పుణ్య నదులను తలుచుకుంటూ స్నానం ఆచరించవలెను.
స్నానాంతరం పాటించాల్సిన నియమాలు
- శివాలయంలో నువ్వులనూనెతో దీపాలను వెలిగించవలెను.
- ఆదివారం రోజున సూర్యుడిని పూజించాలి
- మాఘమాసంలో రోజూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి.. సూర్యోదయ సమయంలో సూర్యుడి నామాలు చెబుతూ అర్ఘ్యం సమర్పించాలి.
- ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయాన్ని పఠించాలి. ఇలా చేయడం వలన వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. సూర్య భగవానుడు ఆయురారోగ్యాలను ఇస్తాడని శాస్త్ర వచనం.
Comments
Post a Comment