కాలభైరవ జయంతి
మార్గశిర మాస శుక్లపక్ష అష్టమి రోజు కాలభైరవస్వామి జయంతి.దీనినే కాలభైరావాష్టమి అని అంటారు. శివుని విశేష అవతారమే కాలభైరవుడు కాబట్టి, ఈశ్వరుణ్ణి పూజిస్తే కాలభైరవుణ్ణి పూజించినట్టే. కాలాష్టమి లేదా కాలభైరవ జయంతి రోజు మాత్రం ఈ పేరుతోనే స్వామిని పూజించడం వల్ల విశేష ఫలితం లభిస్తుంది. కాలభైరవ జయంతి మంగళవారం,లేదా ఆదివారం రావడం విశేషంగా చెబుతారు. శివమహా, స్కాంద పురాణాలలో ప్రధానంగా బ్రహ్మదేవుని గర్వాన్ని అణచడానికే శివుని అవతారంగా ‘భైరవ జననం’జరిగినట్లు ఉంది. బ్రహ్మను ‘చతుర్భుజుడు’ అంటారు. కానీ, అంతకంటే ముందు ఆయనకు అయిదు తలలుండేవి. తానే శ్రీ మహావిష్ణువు కన్నా కూడా గొప్పవాడినని బ్రహ్మ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాడు. పైగా శివుణ్ణి నిందిస్తాడు. శివుని కొనగోటిలోంచి పుట్టిన శక్తి ‘కాలభైరవుని’గా ఆవిర్భవిస్తుంది. మహోగ్రరూపంతో అవతరించిన మహాకాల భైరవుని విశ్వరూపం అత్యంత భీకర భయానకం. అలా ఉద్భవించిన కాలభైరవుడే బ్రహ్మదేవుని అయిదు తలల్లోంచి ఒక దానిని ఖండిస్తాడు. జ్ఞానోదయమైన బ్రహ్మదేవుడు నాటినుంచీ నాలుగు తలలతోనే కొనసాగుతాడు. ఆ కాలభైరవుడే శివాజ్ఞతో విశ్వసంరక్షకుడుగా ఉన్నాడన్నది శాస్త్రీయ కథనం. కాలభైరవుడు అవతరించి