ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి ?
ఇల్లు శుచిగా, శుభ్రంగా ఉండాలి. ఇంట్లో నిత్యం దీపారాధన చేయాలి. పురుటి స్త్రీని విడిగా ఉంచాలి. తులసి, నిమ్మ, వేపవంటి చెట్లు ఇంటి ఆవరణలో ఉండాలి. ఇంట్లో రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత మొదలగు గ్రంథాలను ఉంచుకొని, వాటిని పారాయణం చేయాలి.