Posts

Showing posts from August, 2022

Kumarsain Jatara 2022

Kumarsain is a town in the Shimla district in the state of Himachal Pradesh. It is famous for Char Saala Mela which is celebrated once in four years. According to legends, Koteshwar Mahadev is one of the avatars of Lord Shiva. Mahadev comes out of the temple only once in 4 years, and a great fair takes place . Four Gods start this fair Marechh, Malandu, and Koteshwar (Naya Devta & Budha Devta). All four palanquins can be seen moving all around the fairground, which will be filled more than capacity with humble devotees of Koteshwar Mahadev.  During this festival, Koteshwar Mahadev would meet his other loving deities Marechh and Malendu Devtaa. A great fair is held here in the months of August and September and thousands of devotees of Lord Shiva come here to worship him. Kumarsain Jatar is of 8 days in which Gods stay for 5 days in Kumarsain and 3 days in Mandholi. On the first day, at 4 am Koteshwar Mahadev and Marich Devta are taken out from Sharkot and then they are ...

వినాయక చవితి

Image
  భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితి జరుపుకుంటారు  విఘ్నలు తొలగి పోవడానికి గణపతిని పూజించడం వేదకాలం నుండి వస్తున్న ఆచారం  ఈ రోజు మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని విధివిధానంగా పూజించాలి. ఈ పూజలో 21 రకాల పత్రులతో స్వామిని పూజించడం తప్పనిసరి  గణేశపూజలో పూలకంటే పత్రికే ప్రాధాన్యం ఎక్కువ.  2022 తేదీ : ఆగష్టు 31.

వినాయకుని 8 అవతారాలు

Image
  గణేశుని ఆరాధనతో ఈ సంసారం నుంచి సులభంగా విముక్తి పొందవచ్చని భావిస్తారు.  వేర్వేరు సందర్భాలలో భక్తులను రక్షించేందుకు విఘ్నేశ్వరుడు ఎనిమిది అవతారాలు దాల్చినట్లు ముద్గల పురాణం చెబుతోంది.  వక్రతుండుడు :- పూర్వం ఇంద్రుడు చేసిన ఒక పొరపాటు వల్ల ‘మాత్సర్యాసురుడు’ అనే రాక్షసుడు ఉద్భవించాడు. అతని ధాటికి ముల్లోకాలూ అల్లాడిపోసాగాయి. అతన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి ఉపాయమూ తోచక దేవతలంతా దత్తాత్రేయుని శరణు వేడారు. అంతట దత్తాత్రేయుడు, గణపతిని ప్రార్థించమని సూచించాడు. ‘గం’ అనే బీజాక్షరంతో దేవతలంతా ఆ గణపతిని గురించి తపస్సు చేయగానే ‘వక్రతుండుని’గా అవతరించాడు. ఆయన సింహవాహనుడై ఆ మాత్సర్యాసురుని జయించాడు. వక్రతుండం అనేది ఓంకారానికి ప్రతీకగా, మాత్సర్యాసురుడు మనలోని మత్సరానికి (ఈర్ష్య) ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ లోకం నాది, ఈ లోకంలో అందరికంటే నాదే పైచేయి కావాలి అనుకున్న రోజున ఈర్ష్యాసూయలు జనిస్తాయి. కానీ సృష్టి లీలావిలాసంలో ఈ జగత్తు ఒక నాటకం మాత్రమే అని గ్రహించిన రోజున మనసులో ఎలాంటి ఈర్ష్యా ఉండదు. ఇదే మాత్సర్యం మీద ఓంకారపు విజయం. ఏకదంతుడు :- చ్యవనుడనే రుషి మదాసురుడనే రాక్షసుని సృష్టించాడు. రాక్షసు...

ఇంద్రకీలాద్రి పై దసరా ఉత్సవాలు, దర్శన సమయాలు

 విజయవాడ దుర్గమ్మ ఆల‌యంలో ఈ ఏడాది దసరా ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.  స్లాట్ టైమింగ్స్  తెల్లవారు జామున 3 గంటల నుంచి 5 గంటలు ఉదయం 6 గంటల నుంచి 8 గంటలు ఉదయం 10 గంటల నుంచి 12 గంటలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు  రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వ‌ర‌కు  ఒకసారి స్లాట్ దర్శనం జరగకపోతే మరోసారి దర్శనం చేసుకోడానికి అవకాశం లేదు . దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు. భవానీ భక్తులకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు.

విజయవాడ దుర్గ అమ్మవారి దసరా అలంకారాలు - 2022

Image
దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరము  దసర నవరోత్సవాలు  జరుగుతాయి. ఈ  దసర నవరాత్రి ఉత్సవాలలో   ప్రతి రోజు ఒక అవతారముతో దర్శనము ఇస్తారు. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో దర్శనము ఇస్తారు. సెప్టెంబర్ 26 - శ్రీ స్వర్ణకవచాలంకృత దేవి సెప్టెంబర్ 27 - శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి సెప్టెంబర్ 28 -  శ్రీ గాయత్రీ దేవి సెప్టెంబర్ 29 -  శ్రీ అన్నపూర్ణా దేవి సెప్టెంబర్ 30 - శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి  అక్టోబర్ 01 - శ్రీ మహాలక్ష్మి  అక్టోబర్ 02 - శ్రీ సరస్వతి దేవి (మూల నక్షత్రం ) అక్టోబర్ 03 - శ్రీ దుర్గ దేవి  అక్టోబర్ 04 - శ్రీ మహిషాసురమర్దిని అక్టోబర్  05 -   శ్రీ  రాజరాజేశ్వరి దేవి.

శ్రీ ముండ్కతీయ ఆలయం - ఉత్తరాఖండ్.

Image
  ఈ ఆలయం ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది. కేదార్ లోయ ఒడిలో నెలకొని ఉన్న ఈ ఆలయం దేశంలోనే తలలేని గణేశుడి విగ్రహాన్ని పూజించే ఏకైక ఆలయంగా పేరుగాంచింది. ‘ముండ్’ అంటే తల, కాత్య అంటే విచ్ఛేదనం. శివ పురాణం ప్రకారం గణేశుడు తన తల్లి పార్వతి ఆదేశాలను అనుసరించి, శివుడిని గదిలోకి అనుమతించడు. దీంతో కోపోద్రిక్తుడైన శివుడు తన కొడుకు తల నరికేస్తాడు. గణేశుడు తన కొడుకు అని శివునికి తెలియదు. ఆ తరువాత శివుడు ఏనుగు తలను తెచ్చి, ఆ బాలుడి మొండానికి అతికించి, మరోసారి ప్రాణం పోస్తాడు. దీంతో ఇక్కడి ఆలయాన్ని ముండ్కతీయగా పిలుస్తుంటారు. ఈ ఆలయానికి వెళ్లాలంటే సోన్‌ప్రయాగ్ నుంచి కాలినడకన వెళ్లాలి.  ఈ ఆలయం త్రియుగి నారాయణ్ ఆలయానికి చాలా సమీపంలో ఉంది.

Significance Of Pitru Paksha

Image
Pitru Paksha or Shraddh is the time of the Hindu calendar when people remember and pay their respects to their ancestors. It is believed that if prayers are offered to the Gods during this period, the ancestors would bless their living relatives and their souls will rest in peace.  Rituals such as Tarpan and Pind Daan are performed to appease the ancestors. Srimad Bhagavad Gita tells us that the soul is indestructible. The soul neither dies nor is it born. The soul in each of our bodies is immortal and cannot be destroyed by anything. The motto of the soul is to attain liberation or salvation.  Performing Shraadh helps the soul of the departed to rest in peace and dissolve into the creator. Another reason for performing Tarpan during Pitru Paksha is that it relieves the living of all the bad effects of the nonperformance of rituals dedicated to the ancestors. Hence, it is very important to pray and offer respect to the departed souls with full faith and devotion. The Legend...

పంచబేరాలు - తిరుమల

Image
  ఆనందనిలయంలో కొలువై, పంచబేరాలుగా పేర్గాంచిన శ్రీనివాసుని ఇదు దివ్యమంగళ స్వరూపాలు ఈ విధంగా పిలువ బడుతాయి. ధ్రువబేరం పదడుగుల ఎత్తైన, అతిసుందర మనోహర రూపం కలిగిన, అందరికీ తెలిసిన తిరుమల మూలవిరాట్ స్వయంభు శ్రీనివాసుడు. ఈ విగ్రహం యోగ, భోగ, విరహ రూపాల్లో కాక వీరస్థానక విధానంలో ఉంటుంది. స్థిరమై ఉన్న విగ్రహం కావున ఉత్సవాల్లో సంచార లక్షణం కలిగిన మిగతా నాలుగు బేరాలను చూడవచ్చు. మూలవిరాట్ కళ్ళను నామం దాదాపు పూర్తిగా కప్పేసి ఉంటుంది. ఇదివరకు రెండుసార్లు ఆ నామం పరిమాణం తగ్గించగా, రెండు సార్లూ ఆలయంలో గొడవలు, రక్తపాతం జరిగినట్టు చరిత్ర. శంఖచక్రాలు స్వయంభు విగ్రహంలో భాగం కానందున శంఖచక్ర ఆభరణాలు అమర్చి ఉంటాయి.  కౌతుకబేరం ఆగమ శాస్త్రానుసారం ప్రతి ధ్రువబేరానికి కౌతుకబేరం ఉంటుంది. తిరుమల గర్భాలయంలోని కౌతుకబేరం భోగ శ్రీనివాసుడు. శంఖచక్రాల మినహా ఈ విగ్రహ లక్షణాలు పూర్తిగా ధ్రువబేరంలాగానే ఉంటాయి. పల్లవ యువరాణి సామవాయి ఈ వెండి విగ్రహాన్ని చేయించి క్రీ.శ.614లో సమర్పించినట్టు శాసనం చెబుతోంది. నిత్యదీపారాధన, నిత్యనైవేద్యం, నిత్యాభిషేకం వంటి సేవలు ఈ కౌతుకబేరానికి జరుగుతాయి. ఉత్సవబేరం భక్తులు మలయప్పస్వామి ...

వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు

 వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు. 1. మాచీ పత్రం/మాచ పత్రి 2. దూర్వా పత్రం/గరిక 3. అపామార్గ పత్రం/ఉత్తరేణి 4. బృహతీ పత్రం/ములక 5. దత్తూర పత్రం/ఉమ్మెత్త 6. తులసీ పత్రం/తులసి 7. బిల్వ పత్రం/మారేడు 8. బదరీ పత్రం/రేగు 9. చూత పత్రం/మామిడి 10. కరవీర పత్రం/గన్నేరు 11. మరువక పత్రం/ధవనం, మరువం 12. శమీ పత్రం/జమ్మి 13. విష్ణుక్రాంత పత్రం/ 14. సింధువార పత్రం/వావిలి 15. అశ్వత్థ పత్రం/రావి 16. దాడిమీ పత్రం/దానిమ్మ 17. జాజి పత్రం/జాజిమల్లి 18. అర్జున పత్రం/మద్ది 19.దేవదారు పత్రం 20. గండలీ పత్రం/లతాదూర్వా 21. అర్క పత్రం/జిల్లేడు.

శ్రీ వినాయక స్వామి వారి ఆలయం - అయినవిల్లి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా లో సుప్రసిద్ధ గణపతి ఆలయాల్లో అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఇక్కడ  గణనాధుడు స్వయంభూగా వెలసిన ఉన్నారు. ఈ ఆలయం కాణిపాకం తరువాత అంతటి ప్రాశస్త్యం పొందింది. ఈ వినాయకునికి నారికేళా వినాయకుడు అని కూడా అంటారు. ఒక్క కొబ్బరికాయ కొడితే, కోరిన కోర్కెలు తీరుస్తాడు అని  భక్తుల విశ్వాసం.  దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపాడని చెబుతుంటారు. స్వయంభువ వినాయక క్షేత్రాలలో ఇది మొదటిదని విశ్వసించబడుతుంది. ఇది కృతయుగానికి చెందినదిగా భావిస్తున్నారు. వ్యాస మహర్షి దక్షణ యాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా.. దేవతలు ఆలయాన్ని నిర్మించారు అని చెపుతుంటారు. అనంతర కాలంలో నాటి తూర్పు చాళుక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్ధానాధీశుల వరకు ఎందరో ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధిలో భాగస్వాములయ్యారు…ఆలయం చరిత్ర.ప్రకారం ఈ క్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక క్షేత్రం కన్నా పురాతనమైనది స్థలపురాణం వివరిస్తుంది… పూర్వం అయినవిల్లిలో స్వర్ణ గణపతి మహాయజ్ఞం జరుగుతూ వుండగా వినాయకుడు ప్రత్యక్షమై అక్కడి వారిని అనుగ్...

తిరుమల లడ్డులో రకాలు

Image
  తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రతిరోజూ ఇంచుమించు మూడు లక్షల లడ్లు తయారు చేస్తారు.దాదాపు 700 మంది పోటు కార్మికులు లడ్డు తయారీలో పని చేస్తున్నారు. ప్రస్తుతం మూడు రకాల లడ్డూలను తయారు చేస్తున్నారు. ఆస్థాన లడ్డు : వీటిని ప్రత్యేక సందర్భాల్లో తయారు చేసి అత్యంత ప్రముఖులకు, ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. సాధారణంగా ఈ లడ్డూల విక్రయం జరగదు. దీని బరువు 750 గ్రాములు. వీటి తయారీలో  అధిక మొత్తంలో నెయ్యి, సారపప్పు, ముంతమామిడి పప్పు, కుంకుమపువ్వు వంటి ప్రత్యేక దినుసుల్ని ఉపయోగిస్తారు.  కళ్యాణోత్సవ లడ్డు : కల్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొన్న గృహస్తులకు, భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. సుమారుగా 700 గ్రాముల బరువుంటుంది. కళ్యాణోత్సవం మరికొన్ని ఇతరసేవల్లో పాల్గొన్న భక్తులు. ఈ లడ్డూలను దర్శనానంతరం సంపంగి ప్రాకారంలో గల “వగపడి”లో లభిస్తాయి. ఇప్పుడు కౌంటర్ లో కల్యాణోత్సవ లడ్డులు అమ్ముతున్నారు దీని ధర ఒకటి రూ. 200/- సాధారణ లడ్డు : వీటిని ప్రోక్తం లడ్డూ అని కూడా అంటారు.వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు. ఈ లడ్డూలను, లెక్కగా, ఆలయం వెనుక భాగాన ఉన్న లడ్డూ కౌంటర్లలో విక్రయిస్తారు. కొన్న...

వినాయక చవితి కథలు

 గజాసుర సంహారం సూతమహర్షి శౌనకాది మునులకు ఇలా చెప్పారు. గజముఖుడైన రాక్షసుడు తపస్సు చేసి శివుడిని మెప్పించి కోరరాని వరం కోరాడు. తనను ఎవరూ వధించలేని శక్తిని ఇవ్వాలని, తన ఉదరం(పొట్ట) లోనే శివుడు నివశించాలని కోరాడు. ఇచ్చిన మాట ప్రకారం శివుడు ఆ కోరిక నెరవేర్చాడు. భర్త పరిస్థితి తెలిసి బాధపడిన పార్వతీ దేవి తన పతిని విడిపించాలని విష్ణువును కోరింది. విష్ణువు గంగిరెద్దు  వేషం ధరించి నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్లాడు. గంగిరెద్దునాడించి గజముఖాసురుని మెప్పించాడు గజముఖాసురుడు ఆనందంతో "ఏం కావాలో కోరుకో" అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి నీ ఉదరమందున్న శివుని కోసం వచ్చానని చెప్పాడు. గజముఖాసురునికి శ్రీహరి వ్యూహం తెలుసుకుని తన ఆయువు తీరిందని అర్థం చేసుకున్నాడు. ఉదరంలో ఉన్న శివుని ఉద్దేశించి "ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితం ముగియుచున్నది। నా అనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించాలని "  ప్రార్థించి తన శరీరం నందీశ్వరుని వశం చేశాడు. నందీశ్వరుడు  ఉదరం చీల్చి శివునికి విముక్తి కల్గించాడు. శివుడు గజముఖాసురుని శిరం, చర్మం తీసుకున...

2022 : ఖైరతాబాద్ గణేషుడు ప్రత్యేకతలు

 ఖైరతాబాద్ మహా గణపతి ఈసారి శ్రీపంచముఖ లక్ష్మీ మహాగణపతి పేరుతో కొలువుదీరనున్నాడు.  ఈ ఏడాది మట్టితోనే ఖైరతాబాద్ గణేషుడు రూపు దిద్దుకుంటున్నాడు. మట్టి విగ్రహం కాబట్టి గణేషుడిని ముట్టుకోకుండానే దూరం నుంచి దణ్ణం పెట్టుకోవాలని కనీసం రెండు అడుగుల దూరం నుంచి దర్శించుకోవాలి. రికార్డు స్థాయిలో ఏకంగా 1100ల కేజీల లడ్డూని గణపయ్యకు సమర్పించనున్నారు.  శ్రీపంచముఖ లక్ష్మీ మహాగణపతి విగ్రహం ఎత్తు 50 అడుగులు ఐదు తలలు, 6 చేతులతో గణేశుడి విగ్రహాన్ని రూపుదిద్దనున్నారు. అలంకరణ కోసం తలపై ఏడు సర్పాలను ఉంచనున్నారు. కుడివైపు శ్రీ త్రిశక్తి మహాగాయత్రి , ఎడమ వైపున శ్రీషణ్ముఖ సుబ్రహమణ్యా స్వామి విగ్రహాలు ఏర్పాటుకానున్నాయి.

2022 : తిరుమలలో సెప్టెంబరులో విశేష పర్వదినాలు

 తిరుమలలో సెప్టెంబరులో విశేష పర్వదినాలు సెప్టెంబర్ 1న ఋషి పంచమి. సెప్టెంబర్ 6న, 21న సర్వ ఏకాదశి. సెప్టెంబరు 7న వామన జయంతి. సెప్టెంబరు 9న అనంత పద్మనాభ వ్రతం. సెప్టెంబర్ 11న మహాలయ పక్ష ప్రారంభం. సెప్టెంబరు 13న బృహత్యుమా వ్రతం(ఉండ్రాళ్ళ తద్దె). సెప్టెంబరు 20న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. సెప్టెంబరు 25న మహాలయ అమావాస్య. సెప్టెంబరు 26న తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. సెప్టెంబరు 27న ధ్వజారోహణంతో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం.

2022 : సెప్టెంబ‌రు 5 నుండి 7వ తేదీ వ‌ర‌కు జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప‌విత్రోత్స‌వాలు

జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు సెప్టెంబ‌రు 5 నుండి 7వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. సెప్టెంబ‌రు 4న సాయంత్రం పుణ్యహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం నిర్వ‌హిస్తారు. సెప్టెంబ‌రు 5న‌ చ‌తుష్టార్చాన‌, అగ్ని ప్ర‌తిష్ట‌, ప‌విత్ర ప్ర‌తిష్ట, సాయంత్రం 6 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్నారు. సెప్టెంబరు 6న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 7న పూర్ణాహుతి, పవిత్రవితరణ, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగనున్నాయి. యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

2022 : సెప్టెంబ‌రు 1 నుండి 3వ తేదీ వ‌ర‌కు తాళ్లపాక శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయంలో పవిత్రోత్స‌వాలు.

 తాళ్లపాక శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు సెప్టెంబ‌రు 1 నుండి 3వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. ఆగ‌స్టు 31న సాయంత్రం పుణ్యహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం నిర్వ‌హిస్తారు. యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల్లో భాగంగా సెప్టెంబ‌రు 1న‌ చ‌తుష్టానార్చ‌న‌, బింబారాధన, మండలారాధన, కుంబారాధన, కుండలారాధన, పవిత్రహవనం, ప‌విత్ర‌హోమం, శాత్తుమొర నిర్వ‌హిస్తారు. సెప్టెంబ‌రు 2న పవిత్ర సమర్పణ, నిత్య హోమాలు, సెప్టెంబ‌రు 3న పూర్ణాహుతి, పవిత్రవితరణ, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగనున్నాయి.

Sri Bada Ganesh Temple Timings – Varanasi

Image
  Sri Bada Ganesh Temple is located in Varanasi in the state of Uttarpradesh. Lord Vinayaka Swamy is sitting under the umbrella along with his wives Riddhi and Siddhi. He is 5 and a half feet tall and that exists in the form of Trinetra. He is also Swayabhu here. It is believed that 1000 years ago when Mandakini existed with the Ganges in Kashi. At the same time, this natural statue emerged, which is still in its original form. This temple was built 1000 years ago. Temple Timings 4.45 am to 10.30 pm 4.45 am – Mangala Aarti 10.30 am – Bhog 10.30 pm – Shayan Aarti (on Wednesday at 11.30 pm) How to reach the Temple Easily accessible from Varanasi Nearby Temples Varanasi, Sri Kashi Viswanatha Temple – 1 km Varanasi, Manikarnika Ghat – 1 km Varanasi, Sri Vishalakshi Temple – 1 km.

గణపతి విగ్రహ ఏర్పాటుకు నియమాలు

గణపతి ఆరాధనకు, భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి అత్యంత పవిత్రమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. వినాయక చవితి  రోజున గణేశుడు ప్రసన్నుడవుతాడు. నియమాలు  విగ్రహం విరిగిపోకుండా సంపూర్ణంగా ఉండేలా చూసుకోవాలి. గణపతి విగ్రహంలో ఎలుక, ఒక దంతం, అంకుశం, మోదక ప్రసాదం ఉండాలి. సనాతన సంప్రదాయంలో ఎడమ వైపు నుంచి కుడి వైపునకు తిరిగి ఉన్న తొండం ఉన్న గణపతి విగ్రహానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఎడమ వైపున తొండం ఉన్న వినాయక విగ్రహాన్ని పూజిస్తే, సంపద, వృత్తి, వ్యాపారం, సంతానం ,  వైవాహిక ఆనందం మొదలైన వాటికి సంబంధించిన అన్ని కోరికలు తీరతాయని  విశ్వాసం. కుడివైపు తొండం ఉన్న గణపతిని సిద్ధివినాయకుడు అంటారు. సాధకుడు ఎవారైనా ఇలాంటి గణపతిని పూజిస్తే శత్రువులపై విజయం సాధిస్తాడని,  అతని జీవితానికి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం. గణపతి విగ్రహాన్ని ఉంచేటప్పుడు, దిశపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈశాన్యంలో శుభ్రమైన ప్రదేశంలో గణపతిని ప్రతిష్టించాలి.

Sri Banashankari Temple Timings – Badami

Image
  Sri Banashankari Temple is located at Cholachagudda near Badami in Bagalkot district in the state of Karnataka. Goddess Banashankari is an incarnation of Goddess Parvati. Banashankari is the sixth incarnation of Goddess Durga. This temple was built in the Vijayanagara style of architecture. The main temple has a mukha mantapa, ardha mantapa and a Vimana. This temple was built in the 7 th century. Banashankari Jatare is celebrated in January or February. Temple Timings 7.00 am to 7.15 pm 7.00 am to 9.00 am - Morning Pooja 1.30 pm – Lunch How to reach the Temple 8 km from Badami 40 km from Bagalkot 440 km from Bengaluru. Nearby Temples Hubli, Iskcon Temple – 7 km.

శ్రీ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయం - మాలకొండ

నెల్లూరు జిల్లా వలేటివారి పాలెం మండలంలో ఉన్న మాలకొండ పై లక్ష్మి నరసింహ స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయం నవ నరసింహ ఆలయాలలో ఒక్కటి. సాధారణంగా అన్ని ఆలయాలు ఉదయం సాయంత్రం భక్తులకు దర్శనం కల్పిస్తే ఈ ఆలయంలో మాత్రం స్వామి వారి దర్శనం కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే కలుగుతుంది. స్వామివారి దర్శనార్థం కొండపైకి చేరుకునేందుకు మెట్లమార్గం ఉంది..వాహనాలు వెళ్లే ఏర్పాట్లు కూడా ఉన్నాయి.వారంలో ఒక్కరోజే ఆలయం తెరిచి ఉండడంతో ప్రతిశనివారం వేలాది భక్తులతో ఆలయం కళకళలాడుతుంటుంది. ఇక్కడ చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాలలో మూడు శనివారాలు ఆవు నెయ్యతో దీపారాధన చేస్తే సంతాన ప్రాప్తితో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం.  ఇక్కడ ఏడు ఋషుల పేరుతో ఏడు తీర్థాలు ఉన్నాయి. వీటిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి అని విశ్వసిస్తారు.  అవి నృసింహ తీర్థం, వరుణ తీర్థం, కపిల తీర్థం, అగస్త్య తీర్థం, శంకర తీర్థం, జ్యోతి తీర్థం, ఇంద్ర తీర్థం. జ్యేష్ట మాసంలో స్వామివారికి ముఖ్యమైన పూజలు చేస్తారు. పురాణగాథ పురాణాల ప్రకారం విష్ణుమూర్తిని భూలోకంలో ఈ ప్రాంతంలో కొలువై భక్తులను దర్శనం ఇవ్వాలని లక్ష్మీదేవి కోరిందట. ఆమె కోరిక మే...

ముంబై గణపతికి రూ.316.40 కోట్లకు ఇన్సూరెన్స్

ముంబైలోని అత్యంత సంపన్నమైన గణేష్ పండల్ - గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ (GSB) సేవా మండల్ - ఈ సంవత్సరం గణేష్ చతుర్థి వేడుకల కోసం రికార్డు స్థాయిలో రూ. 316.40 కోట్ల బీమా కవరేజీని తీసుకున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. మండల్ సెక్యూరిటీ కోసం న్యూ ఇండియా అస్యూరెన్స్ నుండి బీమాను తీసుకుంది. బంగారం, వెండి ఆభరణాలు మొత్తం కలిపి రూ. 31.97 కోట్లకు రిస్క్ ఇన్సూరెన్స్ పాలసీ పరిధిలోకి వస్తాయి. సెక్యూరిటీ గార్డులు, పూజారులు, వంట మనుషులు, చెప్పుల దుకాణం ఉద్యోగులు, వాలంటీర్లకు వ్యక్తిగత ప్రమాద బీమా విలువ రూ.263 కోట్లు. ఫర్నీచర్, కంప్యూటర్లు, CCTV కెమెరాలు, పాత్రలు, కిరాణా, పండ్లు, కూరగాయలు వంటి ఇతర వస్తువులు, అగ్ని ప్రమాదాలు, భూకంప ప్రమాదాల వంటి వాటి కోసం ప్రత్యేక ప్రమాద పాలసీని తీసుకున్నారు. ఈ మహా గణపతిని 66 కిలోల కంటే ఎక్కువ బంగారు ఆభరణాలు, 295 కిలోల వెండి మరియు ఇతర విలువైన వస్తువులతో అలంకరించారు. ఆగష్టు 29 న స్వామి వారు దర్శనమివ్వనున్నారు.

2022: ఆగ‌స్టు25 నుండి 27వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

టీటీడీ ఆధ్వర్యంలోఆగ‌స్టు 25 నుండి 27వ తేదీ వరకు తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనుక గల టీటీడీ మూడో సత్ర ప్రాంగణంలో శ్రీవారి  త్రైమాసిక  మెట్లోత్సవం ఘనంగా  జరుగనుంది. ఈ మూడు రోజుల పాటు ఉదయం 5 నుండి 7 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు చేప‌డ‌తారు. ఉదయం 8.30 గంటల నుండి 12.30 గంటల వరకు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన భజన మండళ్ళతో సంకీర్తనలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు ధార్మిక సందేశాలు, మహనీయులు మాన‌వాళికి అందించిన ఉప‌దేశాలు తెలియ‌జేస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆగ‌స్టు25న  సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి మూడో సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అధికార ప్రముఖులు సందేశం ఇవ్వనున్నారు.ఆగ‌స్టు 27వ‌ తేదీ ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వ‌ద్ద‌ మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు. గ‌తంలో ఎందరో మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్...

Sri Pothuraju Poleramma Temple Timings – Venkatagiri

Sri Venkatagiri Poleramma Temple is located in Venkatagiri in Nellore district in the state of Andhra Pradesh. Ammavaru Jatara is a famous event celebrated here. Temple Timings 5.00 am to 12.30 pm 4.00 pm to 8.00 pm How to reach the Temple 82 km from Nellore 40 km from Gudur.

Sri Ganesha Temple Timings – Kurudumale

Image
  Sri Ganesha Temple is located in Kurudumale Village in Mulbagal in the Kolar district in the state of Karnataka. Here the deity measures thirteen and a half feet in height. Lord Ganesha on a pedestal with four hands, a big arch around Ganesha sculpture. The main idol is said to be growing continuously There is no other Saligrama Ganesh idol as big as this anywhere on this earth. Kurudumale means Koodi-malai in tamil means meeting hill. Lord Rama, Sri Krishna, and Pandavas visited this temple. This temple was built in the 13 th century Traditional dress is allowed for darshan. Temple Timings 06.30 am to 1.00 pm 3.00 pm to 8.00 pm How to reach the Temple 40 km from Kolar 100 km from Bengaluru Nearby Temples Bangarpet, Kotilingeswara Temple – 35 km Kolar, Someshwara Temple – 35 km.

అసుర సంధ్య

Image
  హిందువుల  ఆచారాలలో సాయంసంధ్యకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది.  దీనిని "గోధూళి వేళ" అని, "అసుర సంధ్య" అని కూడా వ్యవహరిస్తారు.  పగటికి రాత్రికి సంధి కాలమే సంధ్యా సమయం.  సూర్యాస్తమయం తర్వాత రమారమి 45 నిమిషాలు అసురసంధ్య.  ఈ సమయంలో శుచి,శుభ్రతలతో భగవంతుని ప్రార్ధించాలి. భోజనం చేయడం,నిద్రపోవడం లాంటి పనులు చేయరాదు. ఈ సమయంలో పరమశివుడు పార్వతీ సమేతంగా కైలాసంలో తాండవం చేస్తాడు. కైలాసమందలి ప్రమథ గణములు, భూతకోటి శివ నామాన్ని ఉచ్చరిస్తూ,శివ తాండవాన్ని వీక్షిస్తూ మైమరచి ఉంటారు.  ముప్పది మూడు కోట్ల దేవతలు, బ్రహ్మ విష్ణువులు సైతం మంగళ వాయిద్యాలను వాయిస్తూ ఆనంద తన్మయత్వం తో శివ నర్తనమునకు సహకరిస్తూ ఉంటారు. సమస్తమగు ఋషిదైవ కోటి కైలాసంలో శివ తాండవ వీక్షణానందజనిత తన్మయత్వంతో ఉన్న ఈ సమయంలో అసుర శక్తులు విజృంభించి జనులను బాధిస్తాయి.  అందుకే అసుర సంధ్యలో వేళ కాని వేళ ఆకలి, నిద్ర బద్ధకం వంటివి బాధిస్తాయి. ఈ వికారాలకు లోనైతే ప్రతికూల ఫలితాలు కలుగుతాయి.అలాగాక పరమేశ్వర ధ్యానంతో సంధ్యా సమయం గడపడం వల్ల అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. 

హనుమాన్ చాలీసా

Image
హనుమాన్ చాలీసా చదవటం వల్ల శనిప్రభావం పోతుంది.  హనుమాన్ చాలీసా చదవటానికి ఒక సమయం, పద్ధతి ఉన్నాయి.  అందులోని ప్రతి శ్లోకానికి ప్రత్యేక అర్థం ఉన్నది.  హనుమాన్ చాలీసా పఠనం వల్ల ఒక వ్యక్తిపై అద్భుత ప్రభావం ఉంటుంది. పొద్దున లేదా రాత్రి ఈ హనుమాన్ చాలీసా చదవటానికి మంచి సమయాలు.  శనిప్రభావం ఉన్నవారు ప్రతిరాత్రి హనుమాన్ చాలీసాను 8సార్లు చదవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.  హనుమాన్ చాలీసా ముందు పంక్తులు 8 సార్లు చదవటం వల్ల ఎవర్ని అయినా నిందించటం వల్ల చేసిన పాపాలు తొలగిపోతాయి.  రాత్రి హనుమాన్ చాలీసా పఠనం వల్ల దుష్టశక్తుల నీడ మీ జీవితంపై నుంచి తొలగిపోతుంది.  పిల్లలకి దెయ్యాలంటే భయం ఉన్నప్పుడు భయం పోగొట్టుకోడానికి రాత్రిపూట వారు ఇది చదవడం మంచిది.  హనుమాన్ చాలీసా చదవటంవల్ల హనుమంతుడి కృపకి పాత్రులయి మీకష్టాలను తొలగించుకోగలుగుతారు. ఏదైనా పెద్దపనిలో విజయం సాధించాలనుకుంటే, మంగళ, గురు, శని లేదా మూలా నక్షత్రం ఉన్నరోజు రాత్రులు 108 సార్లు ఇది చదివితే మంచిది.  సరియైన శ్రద్ధ, విశ్వాసంతో హనుమంతుడి అనుగ్రహం కలిగి మీరు కోరుకున్నవన్నీ సాధించగలుగుతారు. దోహా శ్రీ గురు చరణ స...

శ్రీ మహాగణపతి ఆలయం - కురుడుమలై

Image
ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని  కోలూరు జిల్లా ముళబాగిలు సమీపంలో ఉంది. ఇక్కడ శక్తిగణపతిగా స్వామి వారు కొలువై ఉన్నారు. సుమారు 14అడుగుల ఎత్తున్న ఈ భారీ విగ్రహం, ఏక సాలగ్రామ శిలతో తయారుచేశారు. ఈ విగ్రహాన్ని స్వయంగా త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణు,మహేశ్వరుడు)ప్రతిష్టించారని ప్రతీతి.   ఈ ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతుంది. కురుడుమలె గణపయ్యను దర్శించుకుని పని మొదలుపెడితే ఆ కార్యం నిర్విఘ్నంగా నెరవేరుతుందంటారు.  ఈ ఆలయం విశిష్టత ఏంటే   మనం అనుకుంటే ఇక్కడకు వెళ్లలేమట,కేవలం లంబోదరుడి అనుగ్రహం ఉంటేనే వెళ్లగలం అని చెబుతారు.  ఈ ఆలయం సమీపంలో సోమేశ్వరస్వామివారు కూడా కొలువై ఉన్నారు.   కౌండిన్య మహాముని ఈ ప్రాంతంలో నేటీకి ఉన్నారని, ప్రతిరోజూ  రాత్రిసమయంలో వచ్చి స్వామిని దర్శంచుకుంటారని, అక్కడి వారికి అపారమైన నమ్మకం.  ఎందుకంటే ఇప్పటికీ అర్థరాత్రి సమయంలో గుడిలోపలి నుంచి స్త్రోత్రాలు వినిపిస్తాయని, ఓంకారం ప్రతిధ్వనిస్తుందని, పర్వదినాలలో దేవతలంతా వచ్చి స్వామిని సేవిస్తారని చెబుతుంటారు.  స్థలపురాణం త్రిపురాసుర సంహారానికి ముందు త్రిమూర్తులు ఈ గణపతిని పూ...

2022: SRIVARI OCTOBER QUOTA OF ARJITA SEVA ONLINE TICKETS RELEASE ON AUGUST 24

TTD plans to release the October quota of Srivari arjita Seva online tickets on August 24 at 10.00 am. Similarly, the registration process for selective arjita Seva online tickets will also commence from 2.00 pm on August 24. However, the Srivari darshan tickets for those with virtual Kalyanotsavam, arjita brahmotsavam, unjal Seva, and Sahasra Deepalankara Seva tickets will also open up online at 4.00 pm on August 24. TTD appealed to all devotees to make note of all timings and issue dates regarding the Srivari Arjit’s Seva online tickets release and make appropriate bookings.

Athachamayam Festival 2022

Image
  It is celebrated in the Malayalam month of Chingam (Aug/Sep). It marks the beginning of the ten-day Onam festivities in Kerala. It is a Commemoration of the prosperous period of King Mahabali’s rule in Kerala. It is celebrated as a Harvest festival. Athachamayam is celebrated on Atham day in the historical town of Tripunithura, near Kochi. Caparisoned elephants, various varieties of folk arts, floats, and music form the part of the Procession. 2022 Date: August 30.

Time Calculation

The smallest unit for measuring time is called 'Nimesh'. The time taken to drop one's eyelid is called one Nimesh. A Kala consists of fifteen Nimeshas and thirty Kalas make a 'Muhurta'. A day and a night consist of thirty 'Muhurtas'. A month consists of thirty days, divided into two fortnights. One fortnight is known as 'Krishna Paksha (dark lunar phase) and the other is known as Shukla Paksha (bright lunar phase). In Pitarloka the day consists of one fortnight and night of the same number of days. Shukla Paksha is the day of the Pitraloka and Krishna Paksha the night. One 'Ayana' consists of Six months. A year consists of two 'Ayanasa '. One year of the earth is equivalent to a day and a night of the deities. The six months when the Sun is in the southern hemisphere of the earth is actually the time when the deities experience night. On the contrary, the six months when the sun is in the northern hemisphere is the daytime for the d...